Home

ఏఐటీయూసీలో చేరిన బండ హమాలీ కార్మికులు

కండువా కప్పి ఆహ్వానించిన ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు బి అజయ్ సారధి రెడ్డి ప్రధాన కార్యదర్శి రేషపల్లి నవీన్ మహబూబాబాద్:- మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బండ హమాలీ కార్మికులు సుమారు 30 మంది ఏఐటీయూసీలో చేరడం జరిగింది ఈ సందర్భంగా ఏఐటియుసి కండువా కాపీ జిల్లా అధ్యక్షుడు బి అజయ్ సారధి రెడ్డి ప్రధాన కార్యదర్శి రేషపల్లి నవీన్ ఏఐటీయూసీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్మికుల సమస్యల కోసం యాజమాన్యాలతో మాట్లాడి రేట్లు పెంచుతామని తెలిపారు జిల్లా కేంద్రంలో అన్ని రంగాల కార్మికులకు...

శ్రీచైతన్య పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని DSFI- PDSU డిమాండ్

DSFI రాష్ట్ర కార్యదర్శి కేలోత్ సాయికుమార్ PDSU జిల్లా కార్యదర్శి బోనగిరి మధు ఆదివారం అదనపు తరగతులు నిర్వహణ టాలెంట్ టెస్ట్ పేరుతో ముందుస్తూ అడ్మిషన్ చేస్తున్న శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం పరీక్షలను అడ్డుకున్న DSFI -PDSU నేతలు కేలోత్ సాయికుమార్, బోనగిరి మధు జిల్లాలో 4 బ్రాంచ్ లలో పరీక్షలు అడ్డుకున్న విద్యార్థి సంఘం నాయుకులు ఆదివారం సెలవు రోజున కూడా అదనపు తరగతులు నిర్వహిస్తున్న శ్రీచైతన్య పాఠశాల తీరుపై విద్యార్థి సంఘాల నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. నిబంధనలకు...

మదర్ ఇండియా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అవార్డుల వేడుకలో షేక్ చాంద్ పాషా

పుణెలో మదర్ ఇండియా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అవార్డుల వేడుకలో భారత యువతకు విదేశాల్లో భద్రతపై శక్తివంతమైన సందేశం ఇచ్చిన షేక్ చాంద్ పాషా 25 ఏళ్ల సామాజిక సేవకు ఎన్ఆర్ఐ సెల్ టీపీసీసీ కన్వీనర్‌కు ఘన సత్కారం; సురక్షితమైన, చట్టబద్ధమైన మార్గాల్లో విదేశాల్లో ఉద్యోగాలు పొందాలని భారత యువతకు పిలుపు పుణె: కవి మిత్ర సంస్థ ఆధ్వర్యంలో శ్రీ రాజేంద్ర సాగర్ సర్ నాయకత్వంలో నిర్వహించిన ప్రతిష్ఠాత్మక అవార్డుల ప్రదానోత్సవం మరియు కవి సమ్మేళనం కార్యక్రమం పుణెలో అత్యంత ఉత్సాహభరితంగా, గౌరవప్రదంగా,...

ఢిల్లీలోని రాంలీలా మైదానంలోకాంగ్రెస్ సీనియర్ నాయకులు మొయిజ్

ఢిల్లీలోని రాంలీలా మైదానంలో నిర్వహించిన ఓట్ చోరీకి వ్యతిరేకంగా జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న కూకట్పల్లి కాంగ్రెస్ సీనియర్ నాయకులు మొయిజ్ న్యూఢిల్లీ:- దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటు హక్కు పవిత్రతను కాపాడాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలోని చారిత్రాత్మక రాంలీలా మైదానంలో నిర్వహించిన ఓట్ చోరీ వ్యతిరేక కార్యక్రమంలో కూకట్పల్లి కాంగ్రెస్ సీనియర్ నాయకులు మొయిజ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షులు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో కలిసి అయిన పాల్గొన్నారు. కూకట్పల్లి నియోజకవర్గానికి చెందిన...

మల్టీ లెవల్ మార్కెటింగ్ (MLM) పేరుతో జరుగుతున్న ఆర్థిక మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

కొత్త సభ్యులను చేర్పిస్తే భారీ కమిషన్లు వస్తాయనే ఆశతో మోసపోవద్దు. ప్రజల కష్టార్జిత సంపాదనను కాపాడుకోవాలి – ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్. సూర్యాపేట:- సూర్యాపేట జిల్లా ప్రజలు మల్టీ లెవల్ మార్కెటింగ్ (MLM), చైన్ మార్కెటింగ్ పేరుతో జరుగుతున్న ఆర్థిక మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్ సూచించారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చనే ఆశతో, సరైన వివరాలు తెలుసుకోకుండా ఇలాంటి పథకాలలో పెట్టుబడులు పెట్టి కష్టార్జిత సంపాదనను కోల్పోవద్దని హెచ్చరించారు. జిల్లాలో కొంతమంది వ్యక్తులు...

అధిక వడ్డీల ఆశ చూపి డిపాజిట్ల సేకరణ పేరుతో జరుగుతున్న మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

డిపాజిట్ పై వారానికి 10 శాతం, నెలకు 40 శాతం వడ్డీ ఇస్తామనే హామీలను నమ్మవద్దు. అత్యాశకు లోనై కష్టార్జిత సొమ్మును కోల్పోవద్దు – జిల్లా ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్. సూర్యాపేట:- సూర్యాపేట జిల్లా ప్రజలు అధిక వడ్డీలు చెల్లిస్తామనే ఆకర్షణీయమైన హామీలతో జరుగుతున్న ఆర్థిక మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్ సూచించారు. తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం వస్తుందనే ఆశతో ఎలాంటి విచారణ లేకుండా వ్యక్తులు లేదా సంస్థల వద్ద డబ్బులు డిపాజిట్ చేసి...

దుర్వాసనతో నిండి అస్తవ్యస్తంగా మారిన సూర్యాపేట ప్రభుత్వ జనరల్ హాస్పిటల్.

నాణ్యత లేని ఆహారం పెడుతున్న ఫుడ్ కాంట్రాక్టర్, శానిటేషన్ కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలి. ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని PDSU, POW ఆధ్వర్యంలో హాస్పిటల్ ముందు ధర్నా సూర్యాపేట:- సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లో అపరిశుభ్రత, దుర్వాసనతో రోగులు, వారి సహాయకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పిఓడబ్ల్యు జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి రేణుక, పిడిఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్ర అఖిల్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్...

బంజారా విభాగం అధ్యక్షుడిగా డుంగ్రోత్ శ్యామ్ నాయక్ నియామకం

సూర్యాపేట:- తెలంగాణ రక్షణ సేన పార్టీ సూర్యాపేట జిల్లా బంజారా విభాగం జిల్లా అధ్యక్షుడిగా డుంగ్రోత్ శ్యామ్ నాయక్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా తనపై నమ్మకం ఉంచి బంజార విభాగం జిల్లా అధ్యక్షుడిగా నియమించిన పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ కి డుంగ్రోత్ శ్యామ్ నాయక్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే తన నియామకానికి సహకరించిన బంజారా విభాగం రాష్ట్ర అధ్యక్షులు కిషన్ నాయక్ కి, రాష్ట్ర నాయకులు ఇస్మాయిల్ కి, జిల్లా అధ్యక్షులు దేవేందర్ రెడ్డి కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు....

షటిల్ క్రీడాకారుల కోసం ఉచిత గుండె వైద్య శిబిరం.

ముఖ్యమైన పాయింట్స్:క్రీడాకారుల ప్రాణాల పట్ల ప్రత్యేక శ్రద్ధ.. ముందస్తు గుండె పరీక్షలతో భరోసా కల్పించిన డా. రామ్మూర్తి యాదవ్. సూర్యాపేట:- నిత్యం తమతో కలిసి షటిల్ ఆడుతూ, నవ్వుతూ, సరదాగా గడిపిన తోటి క్రీడాకారుడు వెలుగు కర్ణాకర్ ఇటీవల గుండెపోటుతో హఠాన్మరణం చెందడం సహచర క్రీడాకారులను తీవ్ర విషాదానికి గురిచేసింది. కళ్లముందే తిరిగిన ఆత్మీయ క్రీడాకారుడు ఇక లేడనే వార్త అందరినీ కలచివేసింది. ఇలాంటి విషాదకర పరిస్థితి మరే క్రీడాకారుడి కుటుంబంలోనూ చోటుచేసుకోకూడదనే మానవీయ ఆలోచనతో గాయత్రి నర్సింగ్ హోమ్ నిర్వాహకులు డా. ఊర...

రిటైర్డ్ పోలీసుల సంక్షేమానికి ప్రత్యేక కార్యాలయం

ముఖ్యమైన పాయింట్స్:వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయ భవనానికి శంకుస్థాపన చేసిన ఎస్పీ నరసింహ సూర్యాపేట:- పోలీస్ శాఖలో ఎన్నో ఏళ్లపాటు సేవలందించి పదవీ విరమణ పొందిన అధికారులు, సిబ్బంది సమాజంలో గౌరవప్రదమైన స్థానంలో ఉండాలని జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కుడకుడ కోమటికుంట కు వెళ్లే మార్గంలో రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ (Retired Police Officers and Employees Welfare Association) కార్యాలయ భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...

38 ఏళ్ల నిష్కళంక వైద్య సేవలకు ఘన వీడ్కోలు

ముఖ్యమైన పాయింట్స్:వైద్య రంగంలో సంధ్యారాణి సేవలు చిరస్మరణీయం ఖమ్మం:- ప్రభుత్వ వైద్య రంగంలో 38 ఏళ్ల పాటు అంకితభావంతో, నిష్కళంకంగా సేవలందించిన నర్సింగ్ సూపరింటెండెంట్ సంధ్యారాణి పదవీ విరమణ సందర్భంగా ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం ఘనంగా ఆత్మీయ వీడ్కోలు సమావేశం నిర్వహించారు. సాధారణ నర్సుగా ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించి నర్సింగ్ సూపరింటెండెంట్ స్థాయికి ఎదిగిన ఆమె సేవలు ఆదర్శనీయమని వైద్యులు, అధికారులు కొనియాడారు. విధుల పట్ల అంకితభావం, క్రమశిక్షణ, బాధ్యతాయుతమైన పనితీరుతో 38 ఏళ్ల పాటు ఎలాంటి మచ్చ లేకుండా సేవలందించడం...

స్వయంభు శ్రీ అభయ వెంకటేశ్వర స్వామి దేవస్థానం సన్నిధిలో 41 రోజులపాటు అయ్యప్ప స్వాములకు నిత్యాన్నదానం

ఖమ్మం:- స్వయంభు శ్రీ అభయ వెంకటేశ్వర స్వామి దేవస్థానం సన్నిధిలో అయ్యప్ప మాలధారణ స్వాముల కోసం 41 రోజులపాటు నిత్యాన్నదాన కార్యక్రమాన్ని భక్తుల సహకారంతో ప్రారంభించారు. గత పదేళ్లుగా దేవస్థానం ఆధ్వర్యంలో మాలధారణ స్వాములకు ఎంతమంది వచ్చినా అన్నప్రసాదం అందిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ అల్లిక అంజయ్య తెలిపారు. ప్రతి శనివారం స్వాములు, భక్తులు కలిపి సుమారు 3 వేల మందికి అన్నప్రసాద వితరణ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి బొల్లి కొండలరావు, కోశాధికారి పల్లపు సత్యం, గౌరవ అధ్యక్షులు బొల్లి...

16 రోజులు గడిచినా శ్రవణ్ మృతి కేసులో నివేదికలు ఎక్కడ

సూర్యాపేట జిల్లా..... బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని పోలీసు వ్యవస్థ పై మండిపడ్డ లంబాడి విద్యార్థి సేన సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షులు లకావత్ వీరన్న నాయక్... బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు లంబాడి విద్యార్థి సేన పోరాటం ఆగదు. చేతికి అందివచ్చిన ఒక్కగానొక్క కుమారుడిని కోల్పోయి 16 రోజులు గడుస్తున్నా తమకు న్యాయం జరగడం లేదని వంకుడోతు శ్రవణ్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తమ కుమారుడి మృతికి సంబంధించిన అసలు నిజాలు ఇప్పటికీ తెలియడం లేదని, పోలీసులను అడిగినా సరైన సమాధానం...

657 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు

వారం రోజుల్లో నిర్మాణాలు ప్రారంభించాలి.. 100 రోజుల్లో పూర్తి చేయాలి: కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అర్హులైన ప్రతి పేదవాడి సొంతింటి కలను నిజం చేయడమే లక్ష్యంగా ప్రజాపాలన ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో ఇప్పటికే 319 ఇళ్లు మంజూరు చేయగా, రెండో విడతలో మరో 657 ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. శనివారం సూర్యాపేటలో నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో...

అన్నం మెతుకుపైనా అక్రమ వ్యాపారం!

అన్నం మెతుకుపైనా అక్రమ వ్యాపారం! పేదోడి బువ్వపై వ్యాపారుల పంజా.. సన్నబియ్యం ధరలకు రెక్కలు! ఎల్‌నినో ప్రభావం.. సరఫరా సమస్యలు.. ధరల పెరుగుదల.. నిల్వలపై అనుమానాలు – సామాన్యుడి కంచంలో కల్లోలం! నారు పోసింది రైతు.. నీరు పెట్టింది రైతు.. కలుపు తీసింది రైతు.. ఎరువులు వేసింది రైతు.. పంటను కంటికి రెప్పలా కాపాడింది రైతు.. చివరకు ధాన్యం పండించి మార్కెట్‌కు తీసుకొచ్చింది కూడా రైతే! కానీ ఆ ధాన్యానికి ధర నిర్ణయించే అధికారం మాత్రం రైతు చేతిలో లేదు. బియ్యం కొనుగోలు చేసే...

మరకలేని రాజకీయం..! మరువలేని నాయకత్వం..!!

ముఖ్యమైన పాయింట్స్:ఇది సత్యవతి అక్క ప్రయాణం..!!! మరకలేని రాజకీయం..! మరువలేని నాయకత్వం..!! ఇది సత్యవతి అక్క ప్రయాణం..!!! డోర్నకల్ మీద కేసీఆర్ గారి ఆశీస్సులు గట్టిగా ఉన్నట్టేనా? ​ఈ ప్రశ్నకు సమాధానం వెతకాలంటే... ముందుగా మనకు ఒక అడుగు గుర్తువస్తుంది. గులాబీ బాస్ అడుగుజాడల్లో నడవడమే తన శ్వాసగా భావించే మన సత్యవతి అక్క ప్రయాణం ఎవరికీ సాధ్యం కాని ఒక అరుదైన చరిత్ర! మిగతా ఏ నాయకుడికీ లేని ఆ ప్రత్యేకమైన తెగువ ఆమెకే ఎందుకు సొంతం? ఈ ప్రశ్నకు సమాధానమే ఆమె...

ఘనంగా ఏఐటీయూసీ 107వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఏఐటీయూసీ భారీ ప్రదర్శన కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు. కార్మిక లోకానికి అండగా ఏఐటియుసి బీ అజయ్ సారధి రెడ్డి రేషపల్లి నవీన్ పిలుపు. నేడు అఖిలభారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఎఐటియుసి 17వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించడం జరిగింది మార్కెట్ నుండి వందలాదిమంది కార్మికులతో భారీ ప్రదర్శన నిర్వహించడం జరిగింది ఇర్యాలీ స్థానిక గ్రీన్ మార్కెట్ నుండి కోర్టు సెంటర్ వరకు నిర్వహించడం జరిగింది అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ...

ఐకెపి కేంద్ర నిర్వాహకులకు శిక్షణ

తిరుమలగిరి 01 నవంబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ ఖరీఫ్ సీజన్ లో మార్కెట్ నిర్వహణ కోసo అన్ని గ్రామాల్లో ఐకెపి సెంటర్ల నిర్వాహకులు సిద్ధం చేసుకొని ఉండాలని తహసిల్దార్ వినోద్ కుమార్ తెలిపారు. శనివారం మండల సమాఖ్య లో నాగారం, తిరుమలగిరి మండలాల గ్రామాలలో ఐకెపి నిర్వాహకులతో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఏలాంటి ఇబ్బంది జరగకుండా కేంద్రం ఏర్పాటు చేయాలని చెప్పారు. రైతులకు మేలు జరిగే విధంగా ప్రభుత్వం ఆలోచిస్తుందని అందుకు అనుగుణంగా కేంద్రం నిర్వాహకులు...

పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివి

తిరుమలగిరి 01 నవంబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అక్టోబర్ 21 నుంచి 31వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలను నిర్వహించారు పోలీస్ ఫ్లాగ్ డే వారోత్సవాల్లో భాగంగా తిరుమలగిరి, నాగారం, అర్వపల్లి పోలీస్ వారి ఆధ్వర్యంలో పోలీసుల విధులు, స్టేషన్ నిర్వహణ, నేరాల నియంత్రణలో ఆధునిక సాంకేతికత వినియోగంపై తిరుమలగిరి మండలంలో 2కే రన్ నిర్వహించి పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ, చట్టాల పట్ల గౌరవం, సామాజిక బాధ్యత పెంపొందించడమే లక్ష్యమని నాగారం సర్కిల్ ఇన్స్పెక్టర్...

నేలను సంరక్షించుకుందాం అనే అంశంపై అవగాహన అవగాహన సదస్సు

ఏడిఏ శివ నాగిరెడ్డి. జోగులాంబ గద్వాల 31 అక్టోబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి. ఇటిక్యాల . మండలంలోని చాగాపురం రైతు వేదిక నందు ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురిసినందున అన్నదాతలు తమ బోరు, బావుల్లో నీటి లభ్యత ఆధారంగా రబీలో ఆరుతడి పంటలపై దృష్టి సారించాలని అలంపూర్ తాలూకా వ్యవసాయ సంచాలకులు శివనాగిరెడ్డి అన్నారు. శనివారం ఇటిక్యాల మండలం చాగపురం గ్రామంలో గ్రామ సర్పంచ్ బుస్కలి సావిత్రమ్మ అధ్యక్షతన జరిగిన ఖేత్ బచావో, డిజిటల్ వ్యవసాయ విస్తరణ సాంకేతికతలపై అవగాహన...