Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

నేలను సంరక్షించుకుందాం అనే అంశంపై అవగాహన అవగాహన సదస్సు

Author
Posted By Telangana Vaartha
| 31 Oct 2026, 08:47 PM | తాజావార్తలు Flash News
నేలను సంరక్షించుకుందాం అనే అంశంపై అవగాహన అవగాహన సదస్సు

ఏడిఏ శివ నాగిరెడ్డి.
జోగులాంబ గద్వాల 31 అక్టోబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి.
ఇటిక్యాల . మండలంలోని చాగాపురం రైతు వేదిక నందు
ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురిసినందున అన్నదాతలు తమ బోరు, బావుల్లో నీటి లభ్యత ఆధారంగా రబీలో ఆరుతడి పంటలపై దృష్టి సారించాలని అలంపూర్ తాలూకా వ్యవసాయ సంచాలకులు శివనాగిరెడ్డి అన్నారు.
శనివారం ఇటిక్యాల మండలం చాగపురం గ్రామంలో గ్రామ సర్పంచ్ బుస్కలి సావిత్రమ్మ అధ్యక్షతన జరిగిన ఖేత్ బచావో, డిజిటల్ వ్యవసాయ విస్తరణ సాంకేతికతలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అలంపూర్ వ్యవసాయ సంచాలకులు శివ నాగిరెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా శివ నాగిరెడ్డి మాట్లాడుతూ....
ప్రస్తుత వాతావరణ పరిస్థితులు బట్టి పప్పు ధాన్యాలు, కూరగాయలు సాగు చేయవచ్చన్నారు. వరి పంట కోత అనంతరం భూమిలో అందుబాటులో ఉన్న తేమను సమర్థవంతంగా వినియోగించుకొని మినుము, ఉలవ పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు.
పంటల వైవిధ్యీకరణతో పాటు తక్కువ కాలపరిమితి కలిగిన పప్పుధాన్య పంటల సాగు ద్వారా నేలలోని మిగులు తేమను సద్వినియోగం చేసుకోవాలని వివరించారు.
రంగారెడ్డి బయోచార్ తయారీ విధానం, దాని ప్రయోజనాలు మరియు నేల సారవంతాన్ని పెంపొందించడంలో పచ్చిరొట్ట ఎరువుల పంటల ప్రాముఖ్యతను రైతులకు వివరించారు.
మండల వ్యవసాయ అధికారి రవి మాట్లాడుతూ....
ప్రభుత్వ పథకం కింద బోరుబావుల రీఛార్జ్ బండ్లను సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా భూగర్భ జలాల పెంపు మరియు నీటి సంరక్షణ సాధ్యమవుతుందని వివరించారు.
డిజిటల్ వ్యవసాయ విస్తరణ సాంకేతికతలపై విశ్లేషణ నిర్వహిస్తూ రైతులతో చర్చించారు.
ప్రస్తుత ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనల ప్రాముఖ్యతను వివరించి, వాతావరణ అంచనాలు మరియు వ్యవసాయ సలహాలను అనుసరించి పంటల యాజమాన్య చర్యలు చేపట్టాలని
వ్యవసాయ అధికారి రవి రైతులకు సూచించారు.
రైతులు భూసార పరీక్షలు చేయించుకోవాలని మండల వ్యవసాయ అధికారి రవి రైతన్నలకు సూచించారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి సురేందర్ గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.