Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

గుండె పూరి గ్రామ తొలి సర్పంచ్ మృతి

Author
Posted By జేరిపోతుల రాంకుమార్
| 24 Oct 2026, 09:22 PM | తెలంగాణ Telangana
గుండె పూరి గ్రామ తొలి సర్పంచ్ మృతి

తిరుమలగిరి 25 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

తిరుమలగిరి మండల పరిధిలోని గుండెపురి గ్రామ ప్రథమ సర్పంచ్ భద్రగిరి రామారావు శనివారం స్వర్గస్తులయ్యారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, హైదరాబాదులోని నాగోల్ లో నిన్న ఉదయం 11 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. శనివారం నాగోల్ లోని స్మశాన వాటికలో నిర్వహించిన రామారావు అంత్యక్రియలకు తుంగతుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు మందుల సామెల్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మందుల సామెల్ ఆయన భౌతికకాయానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. గుండెపురి గ్రామ తొలి సర్పంచ్ గా గ్రామాభివృద్ధికి రామారావు చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. అనంతరం శోకతప్త హృదయాలతో ఉన్న వారి కుటుంబ సభ్యులను ఓదార్చి, తమ ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. కుటుంబానికి పార్టీ పరంగా, వ్యక్తిగతంగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఈ నివాళులర్పించిన వారిలో ఎమ్మెల్యే సామెల్ తో పాటు తిరుమలగిరి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ధరావతు జుమ్మిలాల్ నాయక్, గ్రామ సర్పంచ్ కొమ్ము సోమన్న, ధరావతు రాజశేఖర్, మాజీ సర్పంచ్ నామాల సోమయ్య, మండల యూత్ అధ్యక్షులు కుర్ర శ్రీనివాస్ పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు పాల్గొని భద్రగిరి రామారావుకు అశ్రునయనాలతో ముక్తకంఠంతో నివాళులు అర్పించారు. రామారావు మృతి గుండెపురి గ్రామానికి, మండల ప్రజాప్రతినిధులకు తీరని లోటని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.