Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

తిరుమలగిరిలో పందుల బెడద : పంటలను కాపాడాలని రైతుల ఆవేదన

Author
Posted By జేరిపోతుల రాంకుమార్
| 27 Oct 2026, 07:25 PM | తెలంగాణ Telangana
తిరుమలగిరిలో పందుల బెడద : పంటలను కాపాడాలని రైతుల ఆవేదన

తిరుమలగిరి 28 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
​
తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని తిరుమల హిల్స్‌ మాలిపురం ప్రాంతంలో పందుల బెడద తీవ్రరూపం దాల్చింది. గుంపులు గుంపులుగా వస్తున్న పందులు వరి పంటను తొక్కి నాశనం చేస్తుండటంతో రైతులు దిక్కుతోಚని స్థితిలో పడ్డారు. ​ఈ ప్రాంతానికి చెందిన రామసాని అశోక్‌ రెడ్డి తండ్రి మల్లారెడ్డి మరియు చుట్టుపక్కల రైతుల పొలాల్లో ప్రస్తుతం వరి పంట సాగులో ఉంది. అయితే, ప్రతిరోజూ పొలాలపై పడుతున్న పందుల గుంపులు పంటను పూర్తిగా పాడుచేస్తున్నాయని రైతులు వాపోతున్నారు. ఈ వరి పంట ఒక్కటే తమ రైతు కుటుంబానికి జీవనాధారమని, ఇది ఇలాగే నష్టపోతే తాము తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్మన్, ఎంఆర్‌ఓ మరియు ఎస్ఐ ల కి వినతిపత్రాలు సమర్పించినప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదని, అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ​ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ మరియు సంబంధిత అధికారులు స్పందించి, దయతో స్పందించి పందుల యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమ పంటలను, జీవనాధారాన్ని కాపాడాలని తిరుమలగిరి చుట్టుపక్కల రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.