తిరుమలగిరిలో పందుల బెడద : పంటలను కాపాడాలని రైతుల ఆవేదన

తిరుమలగిరి 28 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ ​ తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని తిరుమల హిల్స్‌ మాలిపురం ప్రాంతంలో పందుల బెడద తీవ్రరూపం దాల్చింది. గుంపులు గుంపులుగా వస్తున్న పందులు వరి పంటను తొక్కి నాశనం చేస్తుండటంతో రైతులు దిక్కుతోಚని స్థితిలో పడ్డారు. ​ఈ ప్రాంతానికి చెందిన రామసాని అశోక్‌ రెడ్డి తండ్రి మల్లారెడ్డి మరియు చుట్టుపక్కల రైతుల పొలాల్లో ప్రస్తుతం వరి పంట సాగులో ఉంది. అయితే, ప్రతిరోజూ పొలాలపై పడుతున్న పందుల గుంపులు పంటను పూర్తిగా పాడుచేస్తున్నాయని రైతులు వాపోతున్నారు. ఈ వరి పంట ఒక్కటే తమ రైతు కుటుంబానికి జీవనాధారమని, ఇది ఇలాగే నష్టపోతే తాము తీవ్ర ఆర్థిక ఇబ్బందులను...