గుండె పూరి గ్రామ తొలి సర్పంచ్ మృతి

తిరుమలగిరి 25 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ తిరుమలగిరి మండల పరిధిలోని గుండెపురి గ్రామ ప్రథమ సర్పంచ్ భద్రగిరి రామారావు శనివారం స్వర్గస్తులయ్యారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, హైదరాబాదులోని నాగోల్ లో నిన్న ఉదయం 11 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. శనివారం నాగోల్ లోని స్మశాన వాటికలో నిర్వహించిన రామారావు అంత్యక్రియలకు తుంగతుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు మందుల సామెల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మందుల సామెల్ ఆయన భౌతికకాయానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. గుండెపురి గ్రామ తొలి సర్పంచ్ గా గ్రామాభివృద్ధికి రామారావు చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. అనంతరం శోకతప్త హృదయాలతో ఉన్న వారి...