Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

శ్రీచైతన్య పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని DSFI- PDSU డిమాండ్

Author
Posted By Telangana Vaartha
| 02 Nov 2026, 12:20 AM | తాజావార్తలు Flash News
శ్రీచైతన్య పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని DSFI- PDSU డిమాండ్

DSFI రాష్ట్ర కార్యదర్శి కేలోత్ సాయికుమార్
PDSU జిల్లా కార్యదర్శి బోనగిరి మధు
ఆదివారం అదనపు తరగతులు నిర్వహణ
టాలెంట్ టెస్ట్ పేరుతో ముందుస్తూ అడ్మిషన్ చేస్తున్న శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం
పరీక్షలను అడ్డుకున్న DSFI -PDSU నేతలు కేలోత్ సాయికుమార్, బోనగిరి మధు
జిల్లాలో 4 బ్రాంచ్ లలో పరీక్షలు అడ్డుకున్న విద్యార్థి సంఘం నాయుకులు

ఆదివారం సెలవు రోజున కూడా అదనపు తరగతులు నిర్వహిస్తున్న శ్రీచైతన్య పాఠశాల తీరుపై విద్యార్థి సంఘాల నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తున్న సదరు పాఠశాల గుర్తింపును తక్షణమే రద్దు చేయాలని DSFI మరియు PDSU సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం ఉదయం శ్రీచైతన్య పాఠశాల ముందు డీఎస్ యఫ్ ఐ (DSFI ),పీడీఎస్‌యూ (PDSU) నేతలు ధర్నా మరియు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. సెలవు రోజుల్లో కూడా విద్యార్థులపై చదువుల పేరిట తీవ్ర ఒత్తిడి పెంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం పాఠశాల లోపలికి వెళ్లిన విద్యార్థి సంఘాల నాయకులు, జరుగుతున్న తరగతులను నిలిపివేయించి విద్యార్థులను సురక్షితంగా ఇళ్లకు పంపించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ — పాఠశాల విద్యాశాఖ నిబంధనలను బేఖాతరు చేస్తూ ఆదివారాల్లో కూడా క్లాసులు నిర్వహించడం పట్ల విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని, శ్రీచైతన్య యాజమాన్యంపై చర్యలు తీసుకుని పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆదివారం సెలవు రోజున కూడా చట్టవిరుద్ధంగా అదనపు తరగతులు నిర్వహిస్తున్న శ్రీచైతన్య పాఠశాల ముందు DSFI - PDSU విద్యార్థి సంఘాల నాయకులు భారీ ఆందోళన నిర్వహించారు. పాఠశాలకు చేరుకుని తరగతులను నిలిపివేయించిన నాయకులు, విద్యార్థులను క్షేమంగా ఇళ్లకు పంపించారు. నిబంధనలు అతిక్రమిస్తూ విద్యార్థులపై తీవ్ర మానసిక ఒత్తిడి తెస్తున్న పాఠశాల యాజమాన్యంపై విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

శ్రీచైతన్య పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని DSFI- PDSU డిమాండ్ - Additional Image

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.