Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

రిటైర్డ్ పోలీసుల సంక్షేమానికి ప్రత్యేక కార్యాలయం

Author
Posted By Telangana Vaartha
| 01 Nov 2026, 11:37 PM | తాజావార్తలు Flash News
రిటైర్డ్ పోలీసుల సంక్షేమానికి ప్రత్యేక కార్యాలయం

ముఖ్యమైన పాయింట్స్:

  • వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయ భవనానికి శంకుస్థాపన చేసిన ఎస్పీ నరసింహ

సూర్యాపేట:- పోలీస్ శాఖలో ఎన్నో ఏళ్లపాటు సేవలందించి పదవీ విరమణ పొందిన అధికారులు, సిబ్బంది సమాజంలో గౌరవప్రదమైన స్థానంలో ఉండాలని జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కుడకుడ కోమటికుంట కు వెళ్లే మార్గంలో రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ (Retired Police Officers and Employees Welfare Association) కార్యాలయ భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదవీ విరమణ పొందినప్పటికీ పోలీసుల మధ్య ఉన్న అనుబంధం ఎప్పటికీ కొనసాగాలని, ఒకరికొకరు అండగా ఉంటూ సమస్యలను పరిష్కరించుకోవాలని ఆకాంక్షించారు. అసోసియేషన్ సభ్యుల సంక్షేమ కార్యక్రమాలకు తనవంతు సహకారం ఉంటుందని తెలిపారు.. విధి నిర్వహణలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ప్రజలకు సేవలందించిన రిటైర్డ్ పోలీసుల సంక్షేమానికి వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.ఈ కార్యక్రమంలో రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ వ్యవస్థాపకులు కృష్ణారెడ్డి, అధ్యక్షులు దామోదర్ రెడ్డి, కార్యదర్శి పి. పుల్లయ్య, వైస్ ప్రెసిడెంట్ శంకర్ గౌడ్, జిల్లా పోలీస్ వైస్ ప్రెసిడెంట్ శంకర్ నాయక్, జనరల్ సెక్రటరీ వై. కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

రిటైర్డ్ పోలీసుల సంక్షేమానికి ప్రత్యేక కార్యాలయం - Additional Image

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.