రిటైర్డ్ పోలీసుల సంక్షేమానికి ప్రత్యేక కార్యాలయం

ముఖ్యమైన పాయింట్స్:వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయ భవనానికి శంకుస్థాపన చేసిన ఎస్పీ నరసింహ సూర్యాపేట:- పోలీస్ శాఖలో ఎన్నో ఏళ్లపాటు సేవలందించి పదవీ విరమణ పొందిన అధికారులు, సిబ్బంది సమాజంలో గౌరవప్రదమైన స్థానంలో ఉండాలని జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కుడకుడ కోమటికుంట కు వెళ్లే మార్గంలో రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ (Retired Police Officers and Employees Welfare Association) కార్యాలయ భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదవీ విరమణ పొందినప్పటికీ పోలీసుల మధ్య ఉన్న అనుబంధం ఎప్పటికీ కొనసాగాలని, ఒకరికొకరు అండగా ఉంటూ సమస్యలను పరిష్కరించుకోవాలని ఆకాంక్షించారు....