Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

దుర్వాసనతో నిండి అస్తవ్యస్తంగా మారిన సూర్యాపేట ప్రభుత్వ జనరల్ హాస్పిటల్.

Author
Posted By Telangana Vaartha
| 01 Nov 2026, 11:50 PM |
దుర్వాసనతో నిండి అస్తవ్యస్తంగా మారిన సూర్యాపేట ప్రభుత్వ జనరల్ హాస్పిటల్.

నాణ్యత లేని ఆహారం పెడుతున్న ఫుడ్ కాంట్రాక్టర్, శానిటేషన్ కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలి.
ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని PDSU, POW ఆధ్వర్యంలో హాస్పిటల్ ముందు ధర్నా
సూర్యాపేట:-
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లో అపరిశుభ్రత, దుర్వాసనతో రోగులు, వారి సహాయకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పిఓడబ్ల్యు జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి రేణుక, పిడిఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్ర అఖిల్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లోని వివిధ విభాగాలను పరిశీలించిన అనంతరం ఆసుపత్రి ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పిఓడబ్ల్యు జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి రేణుక, పిడిఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్ర అఖిల్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రికి ప్రతిరోజూ వందలాది మంది పేద, మధ్యతరగతి ప్రజలు వైద్యం కోసం వస్తున్నారని, కానీ ఆసుపత్రిలో అన్ని రకాల మందులు లేకపోవడం,కనీస పారిశుద్ధ్య ప్రమాణాలు పాటించకపోవడం వల్ల రోగులు మరింత ఇబ్బందులకు గురవుతున్నారని విమర్శించారు.ఆసుపత్రి పరిసరాల్లో డ్రైనేజ్ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం, మురుగునీటి సమస్యలు, వార్డుల్లో అపరిశుభ్రత, దుర్వాసన వెదజల్లడం వంటి సమస్యలతో రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారని తెలిపారు. పారిశుద్ధ్య నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కోట్లాది రూపాయలు వైద్యరంగానికి ఖర్చు చేస్తున్నామని గొప్పలు చెప్తున్న పాలకులు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఈ పాలకులు ఎం చేస్తున్నారని ప్రశ్నించారు . రక్త పరీక్షల రిపోర్ట్లు రెండు,మూడు రోజులకు రావడం వల్ల రోగం ఏందో అర్ధంకాక ట్రీట్మెంట్ జరగడం లేదన్నారు. అన్ని రకాల మందులు అందుబాటులో లేకపోవడం వల్ల, బయట మెడికల్ షాప్ లో కొనలేక పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పరీక్షలకు సంబంధించిన అన్ని పరికరాలు లేక బయట చేయించుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. రాత్రి వేళల్లో డాక్టర్స్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. చికిత్స తర్వాత రోగుల దగ్గర నుండి బలవతంగా డబ్బులు వసూలు చేసే వారిని ఉద్యగం నుండి తీసివేయాలన్నారు.అదే విధంగా రోగులకు నాణ్యమైన పాలతో పాటు పెట్టాల్సిన నాణ్యమైన ఆహారం కూడా అందించకుండా ఉన్న కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలన్నారు.
పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాల్సిన ప్రభుత్వ ఆసుపత్రి సమస్యల నిలయంగా మారకూడదని, ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సమస్యలన్నింటినీ పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు భీమనపల్లి ప్రకాష్, పిఓడబ్ల్యు జిల్లా ఉపాధ్యక్షులు సూరం రేణుక, జిల్లా సహాయ కార్యదర్శి సంతోషి మాతా, జిల్లా నాయకులు ఐతరాజు పద్మ, కట్ట కల్పన,పద్మ,రహమతి,వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.