దుర్వాసనతో నిండి అస్తవ్యస్తంగా మారిన సూర్యాపేట ప్రభుత్వ జనరల్ హాస్పిటల్.

నాణ్యత లేని ఆహారం పెడుతున్న ఫుడ్ కాంట్రాక్టర్, శానిటేషన్ కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలి. ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని PDSU, POW ఆధ్వర్యంలో హాస్పిటల్ ముందు ధర్నా సూర్యాపేట:- సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లో అపరిశుభ్రత, దుర్వాసనతో రోగులు, వారి సహాయకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పిఓడబ్ల్యు జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి రేణుక, పిడిఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్ర అఖిల్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లోని వివిధ విభాగాలను పరిశీలించిన అనంతరం ఆసుపత్రి ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పిఓడబ్ల్యు జిల్లా ప్రధాన...