Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

మరకలేని రాజకీయం..! మరువలేని నాయకత్వం..!!

Author
Posted By Telangana Vaartha
| 01 Nov 2026, 12:10 AM |
మరకలేని రాజకీయం..!  మరువలేని నాయకత్వం..!!

ముఖ్యమైన పాయింట్స్:

  • ఇది సత్యవతి అక్క ప్రయాణం..!!!

మరకలేని రాజకీయం..!
మరువలేని నాయకత్వం..!!
ఇది సత్యవతి అక్క ప్రయాణం..!!!

డోర్నకల్ మీద కేసీఆర్ గారి ఆశీస్సులు గట్టిగా ఉన్నట్టేనా?
​ఈ ప్రశ్నకు సమాధానం వెతకాలంటే... ముందుగా మనకు ఒక అడుగు గుర్తువస్తుంది. గులాబీ బాస్ అడుగుజాడల్లో నడవడమే తన శ్వాసగా భావించే మన సత్యవతి అక్క ప్రయాణం ఎవరికీ సాధ్యం కాని ఒక అరుదైన చరిత్ర! మిగతా ఏ నాయకుడికీ లేని ఆ ప్రత్యేకమైన తెగువ ఆమెకే ఎందుకు సొంతం?
ఈ ప్రశ్నకు సమాధానమే ఆమె కన్నీటితో కూడిన రాజకీయ ప్రయాణం! అది పదవుల కోసం, స్వార్థం కోసం అటూ ఇటూ మారే చౌకబారు బంధం కానే కాదు. తెలంగాణ ఇంకా రాకముందే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందే... ఆనాడు అధికారంలో లేని, రేపు ఏం జరుగుతుందో కూడా తెలియని చీకటి రోజుల్లో, టీడీపీ నుండి స్వచ్ఛందంగా గులాబీ కండువా కప్పుకున్న పవిత్రమైన మనసు ఆమెది.ఏనాడూ పదవుల కోసం, టికెట్ల కోసం.. ఆమె ఆశపడలేదు; కేవలం కేసీఆర్ గారి అడుగుజాడల్లో నడవడమే తన జీవిత పరమార్థంగా భావించారు. ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో టికెట్ దక్కకపోయినా కన్నీటిని దిగమింగుకుని పార్టీ వెంటే నిలబడ్డారు. మరోసారి మొండిచేయి ఎదురైనా ఆ గుండె जरा కూడా చలించలేదు, ఏనాడు పార్టీని వీడిపోలేదు.
​నిజానికి, టీడీపీ నుండి బీఆర్ఎస్‌లోకి అడుగుపెట్టిన ఆ తొలి క్షణం నుండి నేటి వరకు... అక్క రాజకీయ జీవితం ఒక తెరిచిన పుస్తకం! ఏనాడు ఎలాంటి పార్టీ ఫిరాయింపులు చేయలేదు. "నాకు టికెట్ ఇస్తేనే పార్టీలో ఉంటాను, లేదంటే వేరే దారి చూసుకుంటాను" అనే బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు సత్యవతి అక్క ఎప్పుడూ పాల్పడలేదు. అధికారం ఉన్నా లేకపోయినా, రేపు పార్టీ ఓడిపోయిన తర్వాత కూడా ఏనాడు పక్క చూపులు చూడలేదు; ఆ గులాబీ కండువాను వదలలేదు. బీఆర్ఎస్ పార్టీలో నిజంగా ఇలాంటి నిస్వార్థ నాయకురాలు మరొకరు ఉండరేమో... బహుశా రాష్ట్రంలో ఇంకెవరూ ఉండకపోవచ్చు! ఎక్కడా కనీస మరక కూడా లేని ఈ స్వచ్ఛమైన రాజకీయాన్ని, ఆమె నిబద్ధతను చూసే కేసీఆర్ గారు ఆమెను ఎమ్మెల్సీగా, రాష్ట్ర మంత్రి పదవితో గౌరవించారు.
కానీ, అధికారం పోయి కష్టకాలం వచ్చినప్పుడే ఆ బంధం ఎంత బలమైనదో లోకానికి చాటిచెప్పారు ఆమె. నేడు గులాబీ బాస్ అధికారంలో లేరు... అయినప్పటికీ, " కేసీఆర్ గారు మళ్లీ ముఖ్యమంత్రి కావాలి, ఆ గులాబీ జెండా మళ్లీ సగర్వంగా ఎగరాలి" అనే ఏకైక కల కోసం ఆమె పడుతున్న తపన చూస్తే కంటతడి వస్తుంది! ఆ ఆరాటంతోనే... ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా పాదరక్షకులు (చెప్పులు) లేకుండా, ముళ్ళు రాళ్ళు కాళ్లకు గుచ్చుకుంటున్నా లెక్కచేయకుండా, నిత్యం డోర్నకల్ గడ్డపై కాలిబాటన నడుస్తూ ఆమె చేస్తోన్న ఆ దీక్ష... ఆ దేవుడికే కన్నీరు తెప్పించే నిజమైన రక్తబంధం, అంకితభావానికి నిలువెత్తు రూపం! ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం కలిపినా ఏ పార్టీలోనూ లేనటువంటి ఆ సాటిలేని యాక్సెస్ (ప్రత్యేక చొరవ) అక్క కు దక్కిందంటే, అది అక్క పడిన ఆ కష్టాల పుణ్యమే, చేసిన త్యాగాల ఫలమే!
ఇప్పుడు కేసీఆర్ గారి సంపూర్ణ ఆశీస్సులు మరియు అక్క కు ఉన్న ఈ అసమానమైన పట్టు రెండూ ఒక్కటవుతే, ఒక్కసారి ఊహించుకోండి...డోర్నకల్ రాత ఎలా మారబోతుంది? పెద్దల వద్ద ఆమెకు ఉండే ఆ ప్రత్యేకమైన పలుకుబడి మన ప్రాంతానికి ఎలాంటి వరంగా మారబోతుంది? ఈ పరిణామాలన్నీ ఎలా సాకారమవుతాయో మనం వేచి చూడాల్సిందే!
అచంచలమైన నిబద్ధత, పార్టీ మారడని తత్వం, ఏనాడూ పదవులకై పాకులాడని స్వచ్ఛమైన రాజకీయం, గులాబీ బాస్ గెలుపుకోసం మూడేళ్లుగా సాగిస్తున్న చెప్పులు లేని కఠిన తపస్సు... ఇవన్నీ నిలువెత్తు రూపం దాల్చిన డోర్నకల్ భవిష్యత్ ప్రదాత సత్యవతి అక్కకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు!

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.