Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

స్వయంభు శ్రీ అభయ వెంకటేశ్వర స్వామి దేవస్థానం సన్నిధిలో 41 రోజులపాటు అయ్యప్ప స్వాములకు నిత్యాన్నదానం

Author
Posted By Telangana Vaartha
| 01 Nov 2026, 01:42 AM |
స్వయంభు శ్రీ అభయ వెంకటేశ్వర స్వామి దేవస్థానం సన్నిధిలో 41 రోజులపాటు అయ్యప్ప స్వాములకు నిత్యాన్నదానం

ఖమ్మం:- స్వయంభు శ్రీ అభయ వెంకటేశ్వర స్వామి దేవస్థానం సన్నిధిలో అయ్యప్ప మాలధారణ స్వాముల కోసం 41 రోజులపాటు నిత్యాన్నదాన కార్యక్రమాన్ని భక్తుల సహకారంతో ప్రారంభించారు. గత పదేళ్లుగా దేవస్థానం ఆధ్వర్యంలో మాలధారణ స్వాములకు ఎంతమంది వచ్చినా అన్నప్రసాదం అందిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ అల్లిక అంజయ్య తెలిపారు. ప్రతి శనివారం స్వాములు, భక్తులు కలిపి సుమారు 3 వేల మందికి అన్నప్రసాద వితరణ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి బొల్లి కొండలరావు, కోశాధికారి పల్లపు సత్యం, గౌరవ అధ్యక్షులు బొల్లి కొమరయ్య, గౌరవ సలహాదారులు పల్లెబోయిన చంద్రయ్య , దండా జ్యోతి రెడ్డి, మేకల వీరన్న, ఉపాధ్యక్షులు అల్లిక వీరబాబు, బందు వెంకటేశ్వర్లు, గుగ్గులోత్ మణికంఠ, రాచకొండ వెంకటేశ్వర్లు, పురం తిరుపతయ్య, ఐతనబోయిన వెంకటేశ్వర్లు, భువనగిరి వీరయ్య , బానోతు మల్సూర్ నాయక్, గుగులోతు విజయ, బానోతు సూర్యం, దాచేపల్లి సంతోష్, సరికొండ వెంకటనారాయణ, వల్లోజు రాజు, భక్తులు రెడ్డి బోయిన శ్రీనివాసరావు, దాసరి ఉమామహేశ్వరరావు, కటకం చిన్న హనుమంతరావు , రేపాకుల శ్రీను తదితరులు పాల్గొన్నారు.

స్వయంభు శ్రీ అభయ వెంకటేశ్వర స్వామి దేవస్థానం సన్నిధిలో 41 రోజులపాటు అయ్యప్ప స్వాములకు నిత్యాన్నదానం - Additional Image

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.