Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

అర్హులైన పట్టభద్రులు ఓటరు నమోదు చేసుకోవాలి

Author
Posted By జేరిపోతుల రాంకుమార్
| 28 Oct 2026, 07:35 PM | తెలంగాణ Telangana
అర్హులైన పట్టభద్రులు ఓటరు నమోదు చేసుకోవాలి

నాగారం 29 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
"రాబోయే ఉమ్మడి నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదు చేసుకోవాలని నాగారం మండలం బిఆర్ఎస్వి ఉపాధ్యక్షులు చిప్పలపల్లి బాలస్వామి పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది అత్యంత శక్తివంతమైన ఆయుధమని, పట్టభద్రులు తమ ప్రాతినిధ్యాన్ని బలోపేతం చేసుకోవడానికి ఓటరు నమోదు ప్రక్రియలో భాగస్వాములు కావాలని కోరారు. డిగ్రీ లేదా దానికి సమానమైన అర్హత కలిగి ఉండి, ఉత్తీర్ణులై మూడేళ్లు పూర్తయిన ప్రతీ ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకునేందుకు అర్హులని తెలిపారు.
​నమోదు చేసుకోవడానికి అవసరమైన ఫారం-18 (Form-18) ను పూర్తి చేసి, సంబంధిత విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలతో ఆన్‌లైన్‌లో లేదా నిర్దేశిత కేంద్రాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. యువత, విద్యావంతులు పెద్ద సంఖ్యలో ముందుకు వచ్చి ఓటర్లుగా నమోదు చేసుకుని తమ రాజ్యాంగ హక్కును వినియోగించుకొని మన సమస్యలపై గళం ఎత్తే నాయకున్ని ఎన్నుకోవాలని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.