అర్హులైన పట్టభద్రులు ఓటరు నమోదు చేసుకోవాలి

నాగారం 29 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ "రాబోయే ఉమ్మడి నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదు చేసుకోవాలని నాగారం మండలం బిఆర్ఎస్వి ఉపాధ్యక్షులు చిప్పలపల్లి బాలస్వామి పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది అత్యంత శక్తివంతమైన ఆయుధమని, పట్టభద్రులు తమ ప్రాతినిధ్యాన్ని బలోపేతం చేసుకోవడానికి ఓటరు నమోదు ప్రక్రియలో భాగస్వాములు కావాలని కోరారు. డిగ్రీ లేదా దానికి సమానమైన అర్హత కలిగి ఉండి, ఉత్తీర్ణులై మూడేళ్లు పూర్తయిన ప్రతీ ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకునేందుకు అర్హులని తెలిపారు. ​నమోదు చేసుకోవడానికి అవసరమైన ఫారం-18 (Form-18) ను...