Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలకు డీకే స్నిగ్ధ రెడ్డి ఆర్థిక సాయం

Author
Posted By Telangana Vaartha
| 21 Oct 2026, 11:08 PM | తెలంగాణ Telangana
రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలకు డీకే స్నిగ్ధ రెడ్డి ఆర్థిక సాయం

గద్వాల:- కర్ణాటకలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం ఇందువాసి గ్రామానికి చెందిన వలస కూలీల కుటుంబాలను బీజేపీ జిల్లా యువ నాయకురాలు డీకే స్నిగ్ధ రెడ్డి పరామర్శించారు. మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఒక్కో బాధిత కుటుంబానికి రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధితుల బాధ వర్ణనాతీతమని పేర్కొన్నారు. ఈ కష్టకాలంలో బాధిత కుటుంబాలు ధైర్యంగా ఉండాలని సూచించారు. మృతుల కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటానని, బాధిత కుటుంబాల్లోని పిల్లల చదువులకు అవసరమైన సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు, జిల్లా కోశాధికారి మీర్జాపురం రామచంద్ర రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు బలిగెరా నల్లరెడ్డి, గద్వాల ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి బలిగేరా శివారెడ్డి, కౌన్సిలర్ శాలన్న తదితరులు పాల్గొన్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.