రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలకు డీకే స్నిగ్ధ రెడ్డి ఆర్థిక సాయం
గద్వాల:- కర్ణాటకలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం ఇందువాసి గ్రామానికి చెందిన వలస కూలీల కుటుంబాలను బీజేపీ జిల్లా యువ నాయకురాలు డీకే స్నిగ్ధ రెడ్డి పరామర్శించారు. మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఒక్కో బాధిత కుటుంబానికి రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధితుల బాధ వర్ణనాతీతమని పేర్కొన్నారు. ఈ కష్టకాలంలో బాధిత కుటుంబాలు ధైర్యంగా ఉండాలని సూచించారు. మృతుల కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటానని, బాధిత కుటుంబాల్లోని పిల్లల చదువులకు అవసరమైన సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు....