రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలకు డీకే స్నిగ్ధ రెడ్డి ఆర్థిక సాయం
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధితుల బాధ వర్ణనాతీతమని పేర్కొన్నారు. ఈ కష్టకాలంలో బాధిత కుటుంబాలు ధైర్యంగా ఉండాలని సూచించారు. మృతుల కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటానని, బాధిత కుటుంబాల్లోని పిల్లల చదువులకు అవసరమైన సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు, జిల్లా కోశాధికారి మీర్జాపురం రామచంద్ర రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు బలిగెరా నల్లరెడ్డి, గద్వాల ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి బలిగేరా శివారెడ్డి, కౌన్సిలర్ శాలన్న తదితరులు పాల్గొన్నారు.