Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

అమెరికాలో జరిగిన పవర్ లిఫ్టింగ్ పోటీలలో రజిత, కాంస్య పథకాలు సాధించిన

Author
Posted By Telangana Vaartha
| 02 Nov 2026, 11:51 PM |
అమెరికాలో జరిగిన పవర్ లిఫ్టింగ్ పోటీలలో రజిత, కాంస్య పథకాలు సాధించిన

అమెరికాలో జరిగిన పవర్ లిఫ్టింగ్ పోటీలలో రజిత, కాంస్య పథకాలు సాధించిన డివి శంకర్రావును సత్కరించిన గాయత్రీ బ్రాహ్మణ సేవా సంఘం, భద్రాద్రి బ్రాహ్మణ పురోహిత సంఘం.

తెలంగాణ వార్త నవంబర్ 2 జిల్లా స్టాపర్ టెంపుల్ టౌన్ భద్రాచలం:- అమెరికాలోని నెవాడ రాష్ట్రం, రెనో నగరంలో జరిగిన ప్రపంచ మాస్టర్స్ పవర్ లిప్టింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో దివ్య క్షేత్రం భద్రాచలం కు చెందిన విశ్రాంత ఎస్బిఐ ఉద్యోగి శ్రీ డివి శంకర్రావు రజిత పతకం, కాంస్య పతకం సాధించడం పట్ల భద్రాద్రి బ్రాహ్మణ పురోహిత సంఘం వారు శంకర్రావు ను అభినందిస్తూ శ్రీ సీతారామచంద్ర స్వామి వారి శేష వస్త్రంతో సత్కరించారు. భద్రాచలం గోదావరి స్నాన ఘట్టాల వద్ద ఉన్న పుష్కర స్తూపం వద్ద గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు భద్రాద్రి బ్రాహ్మణ పురోహిత సంఘం అధ్యక్షులు రామా వజ్జల. రవికుమార్ శ్రీడివి శంకర్రావు కు పుష్పగుచ్చం ఇచ్చి భద్రాద్రి రాముని శేష వస్త్రంతో సత్కరించారు. బైపాస్ సర్జరీ చేయించుకుని ఉన్నప్పటికీ73 ఏళ్ల వయస్సులో అమెరికాలో రజిత, కాంస్యరెండు పతకాలు సాధించి పెట్టడం తెలుగు రాష్ట్రాలకు గర్వకారణమని రామా వజ్జల తెలిపారు. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి శుభాశీస్సులతోభవిష్యత్తులో శంకర్రావు బంగారు పథకం సాధిస్తారని పురోహితులు ఆశీర్వదించారు. కాకరాల శ్రీనివాస్ శర్మ, కంజర్ల విజయ్ కుమార్, ఆర్ వీరభద్ర శర్మ, ఆర్ వి శ్రీని వాస్, కలకోట రఘురాం ఆచార్య, చిట్టి చంద్రశేఖర్, కోవూరుదిలీప్ కుమార్ శర్మ, తే జాశర్మ తదితరులు పాల్గొన్నారు. తనను సత్కరించి శుభాశీస్సులు అందించిన పురోహితులకు శంకర్రావు ధన్యవాదాలు తెలిపారు.

అమెరికాలో జరిగిన పవర్ లిఫ్టింగ్ పోటీలలో రజిత, కాంస్య పథకాలు సాధించిన - Additional Image

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.