Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

తిరుమలగిరి మార్కెట్‌లో గోనె సంచుల పంచాయతీ 4 రోజులుగా మార్కెట్ బంద్…

Author
Posted By జేరిపోతుల రాంకుమార్
| 30 Oct 2026, 08:55 PM | Array
తిరుమలగిరి మార్కెట్‌లో గోనె సంచుల పంచాయతీ 4 రోజులుగా మార్కెట్ బంద్…

తిరుమలగిరి మార్కెట్‌లో గోనె సంచుల పంచాయతీ!
4 రోజులుగా మార్కెట్ బంద్…
తిరుమలగిరి 31 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:-
వారానికి రెండు లేదా మూడు రోజులు మాత్రమే మార్కెట్ యార్డు పని దినాలు ఇలా అయితే ఎలా అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు, వ్యాపారులు, కూలీలకు తప్పని ఇబ్బందులు పట్టించుకోని మార్కెట్ యాజమాన్యం సంబంధిత అధికారులు ప్రస్తుతం అసలే తీవ్ర వర్షాభావ పరిస్థితులు, పంటల దిగుబడి తగ్గి రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తిరుమలగిరి మార్కెట్‌లో గోనె సంచుల విషయంలో తలెత్తిన వివాదం కారణంగా నాలుగు రోజులుగా మార్కెట్ కార్యకలాపాలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది.ఈ మార్కెట్‌పైనే ఆధారపడి వందలాది కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయి. రైతులు, హమాలీలు, గుమస్తాలు, వ్యాపారులు, చిరు వ్యాపారులు ఇలా ఎంతోమంది మార్కెట్ బంద్‌తో నష్టపోతున్నారు. అసలు ప్రశ్నలు ఇవే… గోనె సంచుల పంచాయతీకి పరిష్కారం ఎప్పుడు? మార్కెట్ బంద్‌తో రైతులకు జరుగుతున్న నష్టానికి బాధ్యత ఎవరిది? రోజువారీ కూలీపై ఆధారపడే కుటుంబాల పరిస్థితి ఏమిటి?మార్కెట్ బంద్ వల్ల ఎవరికి లాభం? ఎవరికి నష్టం? గోనె సంచుల వివాదం ఏదైనా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. రైతుల ప్రయోజనాలు, కూలీల జీవనోపాధి దెబ్బతినకుండా వెంటనే మార్కెట్‌ను పునఃప్రారంభించేలా సంబంధిత అధికారులు, మార్కెట్ పాలకులు చర్యలు తీసుకోవాలి. రైతు బాగుంటేనే మార్కెట్ బాగుంటుంది… మార్కెట్ నడిస్తేనే వందలాది కుటుంబాలకు జీవనాధారం!తిరుమలగిరి మార్కెట్ సమస్యకు తక్షణ పరిష్కారం చేయాలని రైతులు ఆరోపించారు

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.