Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

సెల్‌ఫోన్ వాడకంపై గొడవ.. కన్నకూతురినే హత్య చేసిన తల్లి

Author
Posted By Telangana Vaartha
| 30 Oct 2026, 08:32 PM | తాజావార్తలు Flash News
సెల్‌ఫోన్ వాడకంపై గొడవ.. కన్నకూతురినే హత్య చేసిన తల్లి

ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం.. పోస్టుమార్టం నివేదికతో వెలుగులోకి వచ్చిన అసలు నిజం!రంగారెడ్డి జిల్లా కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలో దారుణ ఘటన వెలుగుచూసింది. సెల్‌ఫోన్ వాడకం విషయంలో జరిగిన గొడవ కారణంగా కన్నతల్లే తన 14 ఏళ్ల కుమార్తెను గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తూరు హనుమాన్ కాలనీకి చెందిన ముయ్యడి రాజు, విజయలక్ష్మి దంపతుల కుమార్తె సువర్చల (14) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది.

బాలిక తరచూ మొబైల్ ఫోన్ ఉపయోగిస్తుండటంతో తల్లి విజయలక్ష్మి మందలించేదని, ఈ విషయమై ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవని పోలీసులు తెలిపారు.

అక్టోబర్ 27న మరోసారి తల్లీకూతుళ్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన విజయలక్ష్మి తన కుమార్తె గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం!

ఇవి కూడా చదవండి

కుమార్తె మృతి చెందిన అనంతరం నేరాన్ని కప్పిపుచ్చేందుకు బాలిక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు నమ్మించే ప్రయత్నం చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

అయితే బాలిక మృతిపై అనుమానాలు వ్యక్తం కావడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నివేదికలో గొంతు నులిమిన ఆనవాళ్లు బయటపడటంతో కేసు కీలక మలుపు తిరిగింది.

వైద్య నివేదిక ఆధారంగా దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు విజయలక్ష్మిని అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు. అనంతరం ఆమెను జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.

షాద్‌నగర్ డీసీపీ సి. శిరీష రాఘవేంద్ర, ఏసీపీ పి. లక్ష్మీనారాయణ పర్యవేక్షణలో కొత్తూరు పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేశారు.

కన్నతల్లిపైనే కుమార్తె హత్య ఆరోపణలు రావడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.