సెల్ఫోన్ వాడకంపై గొడవ.. కన్నకూతురినే హత్య చేసిన తల్లి
ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం.. పోస్టుమార్టం నివేదికతో వెలుగులోకి వచ్చిన అసలు నిజం!రంగారెడ్డి జిల్లా కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలో దారుణ ఘటన వెలుగుచూసింది. సెల్ఫోన్ వాడకం విషయంలో జరిగిన గొడవ కారణంగా కన్నతల్లే తన 14 ఏళ్ల కుమార్తెను గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తూరు హనుమాన్ కాలనీకి చెందిన ముయ్యడి రాజు, విజయలక్ష్మి దంపతుల కుమార్తె సువర్చల (14) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. బాలిక తరచూ మొబైల్ ఫోన్ ఉపయోగిస్తుండటంతో తల్లి విజయలక్ష్మి మందలించేదని, ఈ విషయమై ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవని పోలీసులు తెలిపారు. అక్టోబర్ 27న మరోసారి తల్లీకూతుళ్ల...