Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

లెప్రసీ కేసుల గుర్తింపు కార్యక్రమం

Author
Posted By Telangana Vaartha
| 30 Oct 2026, 08:23 PM | తాజావార్తలు Flash News
లెప్రసీ కేసుల గుర్తింపు కార్యక్రమం

జోగులాంబ గద్వాల 30 అక్టోబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి. గద్వాల. డీఎంహెచ్వో డా. సంధ్యా కిరణ్మయి ఆధ్వర్యంలో, జిల్లా లెప్రసి ప్రోగ్రామ్ అధికారి డా. జి. రాజు మరియు డి పి ఎం ఓ నందిశ్వర్ పర్యవేక్షణలో నిర్వహిస్తున్న లెప్రసి కేసుల గుర్తింపు కార్యక్రమం (Leprosy Case Detection Campaign – LCDC) అమలు తీరును పరిశీలించేందుకు రాష్ట్ర స్థాయి అధికారి డా. జరినా భాను జిల్లా కేంద్రంలో MCH సెంటర్ పరిధిలోని షెరెల్లి వీధిలో సందర్శించారు.
ఈ సందర్భంగ రాష్ట్ర స్థాయి బృందం గ్రామంలో నిర్వహిస్తున్న కుష్ఠువ్యాధి లక్షణాల గుర్తింపు సర్వేను, క్షేత్రస్థాయిలో ఆరోగ్య సిబ్బంది చేపడుతున్న కార్యక్రమాలను క్షుణ్ణంగ పరిశీలించింది. సర్వే నిర్వహణ విధానం, అనుమానిత కేసుల గుర్తింపు, ప్రజలకు కుష్ఠువ్యాధిపై అవగాహన కల్పించడం వంటి అంశాలను సమీక్షించి, కార్యక్రమాన్ని సమర్థవంతంగ నిర్వహించేందుకు అవసరమైన సూచనలు చేశారు.
కుష్ఠువ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి, వ్యాధి వ్యాప్తిని అరికట్టడం LCDC కార్యక్రమం ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు. కుష్ఠువ్యాధి లక్షణాలు ఉన్నవారిని ముందుగానే గుర్తించి, వారికి సమీప ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల ద్వార ఉచితంగ వైద్య పరిక్షలు, చికిత్స అందించడం జరుగుతుందని పేర్కొన్నారు.
ప్రజలు చర్మంపై స్పర్శజ్ఞానం తగ్గిన మచ్చలు లేద కుష్ఠువ్యాధికి సంబంధించిన అనుమానిత లక్షణాలను గుర్తించినప్పుడు నిర్లక్ష్యం చేయకుండ, వెంటనే సమీప ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించి వైద్య పరిక్షలు చేయించుకోవాలని అధికారులు సూచించారు. వ్యాధిని ప్రారంభ దశలో గుర్తించి చికిత్స తీసుకోవడం ద్వార వైకల్యాలను నివారించవచ్చని తెలిపారు.
జోగులాంబ గద్వాల జిల్లాలో LCDC కార్యక్రమాన్ని సమర్థవంతంగ అమలు చేస్తూ, కుష్ఠువ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంపొందించడంతో పాటు వ్యాధి నిర్మూలన లక్ష్య సాధన దిశగ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఇట్టి తనిఖీలో సూపర్వైజర్ వెంకటసుబ్బమ్మ, ANM- అజూబ, మరియు ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.