లెప్రసీ కేసుల గుర్తింపు కార్యక్రమం

జోగులాంబ గద్వాల 30 అక్టోబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి. గద్వాల. డీఎంహెచ్వో డా. సంధ్యా కిరణ్మయి ఆధ్వర్యంలో, జిల్లా లెప్రసి ప్రోగ్రామ్ అధికారి డా. జి. రాజు మరియు డి పి ఎం ఓ నందిశ్వర్ పర్యవేక్షణలో నిర్వహిస్తున్న లెప్రసి కేసుల గుర్తింపు కార్యక్రమం (Leprosy Case Detection Campaign – LCDC) అమలు తీరును పరిశీలించేందుకు రాష్ట్ర స్థాయి అధికారి డా. జరినా భాను జిల్లా కేంద్రంలో MCH సెంటర్ పరిధిలోని షెరెల్లి వీధిలో సందర్శించారు. ఈ సందర్భంగ రాష్ట్ర స్థాయి బృందం గ్రామంలో నిర్వహిస్తున్న కుష్ఠువ్యాధి లక్షణాల గుర్తింపు సర్వేను, క్షేత్రస్థాయిలో ఆరోగ్య సిబ్బంది చేపడుతున్న కార్యక్రమాలను క్షుణ్ణంగ పరిశీలించింది. సర్వే...