Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

రసాయన ఎరువులు తగ్గించండి భూసారాన్ని రక్షించండి

Author
Posted By జేరిపోతుల రాంకుమార్
| 29 Oct 2026, 08:16 PM | తెలంగాణ Telangana
రసాయన ఎరువులు తగ్గించండి భూసారాన్ని రక్షించండి

తిరుమలగిరి 30 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:
తిరుమలగిరి మండలంలోని తొండ గ్రామంలో రైతు వేదిక నందు ఖేత్ బచావో అభియాన్" (నేలలను రక్షించుకుందాం) పై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కృషి విజ్ఞాన కేంద్రం-గడ్డిపల్లి శాస్త్రవేత్త డా. పి. అక్షిత్ సాయి, సైంటిస్ట్ శాస్త్రవేత్త మాట్లాడుతూ భూసారాన్ని కాపాడటానికి, రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి సహజ వ్యవసాయాన్ని చేయాలి అన్నారు.భూసార పరీక్ష కు మట్టి నమూనా సేకరించే విధానం పై అవగాహన కల్పించారు.అధికంగా రసాయన ఎరువులు వాడటం వల్ల భూసారం తగ్గిపోతోంది. వీటి వాడకాన్ని తగ్గించి, సేంద్రీయ మరియు సహజ వ్యవసాయ పద్ధతులను అవలంబించేలా రైతులకు అవగాహన కల్పించారు.భూసార పరీక్షలు ప్రతి రైతు తన భూసార పరీక్షలు చేయించుకొని, భూమికి అవసరమైన పోషకాలను, ఎరువులను మాత్రమే వాడేలా ప్రోత్సహించేలా దీని ద్వారా సాగు ఖర్చులు తగ్గుతాయి.సుస్థిర వ్యవసాయం: వాతావరణ మార్పులను తట్టుకుంటూ, ఎక్కువ దిగుబడి సాధించే ఆధునిక, పర్యావరణహిత వ్యవసాయ పద్ధతులపై శిక్షణ ఇచ్చారు. ఈ ప్రచారం ఒక నెల రోజుల పాటు జిల్లాలోనీ గ్రామాల్లోనూ ఈ కార్యక్రమం కొనసాగుతుంది అన్నారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి మహిత, గ్రామ సర్పంచ్ బి.స్వాతి భాస్కర్ వర్డ్ మెంబర్ బి. సంధ్య, హార్టికల్చర్ ఫీల్డ్ అసిస్టెంట్ యమునా మరియు రైతులు ఎర్ర అనిల్, తెరటి సాయి కుమార్, వజ్జ స్వామి, రాజు, రామ్ ప్రసాద్ రైతులు పాల్గొనారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.