రసాయన ఎరువులు తగ్గించండి భూసారాన్ని రక్షించండి
తిరుమలగిరి 30 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్: తిరుమలగిరి మండలంలోని తొండ గ్రామంలో రైతు వేదిక నందు ఖేత్ బచావో అభియాన్" (నేలలను రక్షించుకుందాం) పై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కృషి విజ్ఞాన కేంద్రం-గడ్డిపల్లి శాస్త్రవేత్త డా. పి. అక్షిత్ సాయి, సైంటిస్ట్ శాస్త్రవేత్త మాట్లాడుతూ భూసారాన్ని కాపాడటానికి, రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి సహజ వ్యవసాయాన్ని చేయాలి అన్నారు.భూసార పరీక్ష కు మట్టి నమూనా సేకరించే విధానం పై అవగాహన కల్పించారు.అధికంగా రసాయన ఎరువులు వాడటం వల్ల భూసారం తగ్గిపోతోంది. వీటి వాడకాన్ని తగ్గించి, సేంద్రీయ మరియు సహజ వ్యవసాయ పద్ధతులను అవలంబించేలా రైతులకు అవగాహన కల్పించారు.భూసార పరీక్షలు...