Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఫోటోగ్రాఫర్ సుమంత్ కుటుంబానికి రూ.15 వేల ఆర్థిక సాయం

Author
Posted By Telangana Vaartha
| 24 Oct 2026, 08:41 PM | తాజావార్తలు Flash News
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఫోటోగ్రాఫర్ సుమంత్ కుటుంబానికి రూ.15 వేల ఆర్థిక సాయం

జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం నీలిపల్లి గ్రామానికి చెందిన ఫోటోగ్రాఫర్ సుమంత్ ఈ నెల 19న జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆయన కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ నేపథ్యంలో జిల్లా ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శేఖర్ ఆధ్వర్యంలో శనివారం ఫోటోగ్రాఫర్లు సుమంత్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఈ సందర్భంగా మృతుడి కుటుంబానికి అండగా నిలుస్తూ రూ.15,000 ఆర్థిక సాయాన్ని అందజేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు.

తోటి ఫోటోగ్రాఫర్ అకాల మరణం తమను తీవ్రంగా కలచివేసిందని అసోసియేషన్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యతని పేర్కొన్నారు. ఆపద సమయంలో మానవత్వంతో స్పందించి ఆర్థిక సాయం అందించడం ద్వారా జిల్లా ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ తమ ఐక్యతను, సేవాభావాన్ని చాటుకుంది.

ఇవి కూడా చదవండి

ఈ కార్యక్రమంలో బీచుపల్లి, రంగన్న, వేణు, సత్యం, బతుకన్న, నరసింహులు, శివ, అశోక్, ప్రవీణ్ తదితర ఫోటోగ్రాఫర్లు పాల్గొన్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.