రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఫోటోగ్రాఫర్ సుమంత్ కుటుంబానికి రూ.15 వేల ఆర్థిక సాయం

జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం నీలిపల్లి గ్రామానికి చెందిన ఫోటోగ్రాఫర్ సుమంత్ ఈ నెల 19న జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆయన కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ నేపథ్యంలో జిల్లా ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శేఖర్ ఆధ్వర్యంలో శనివారం ఫోటోగ్రాఫర్లు సుమంత్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మృతుడి కుటుంబానికి అండగా నిలుస్తూ రూ.15,000 ఆర్థిక సాయాన్ని అందజేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు. తోటి ఫోటోగ్రాఫర్ అకాల మరణం తమను తీవ్రంగా కలచివేసిందని అసోసియేషన్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి...