Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

భూ అక్రమాలపై ముగ్గురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్

Author
Posted By Telangana Vaartha
| 24 Oct 2026, 08:32 PM | తాజావార్తలు Flash News
భూ అక్రమాలపై ముగ్గురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్

భూముల లావాదేవీల్లో తీవ్ర అవకతవకలు, విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ముగ్గురు రెవెన్యూ అధికారులపై జిల్లా కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ కఠిన చర్యలు తీసుకున్నారు. హుజుర్ నగర్ తహసీల్దార్‌ బి. కవిత, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ కాశీం షరీఫ్‌, గ్రామ పాలన అధికారి (జీపీవో) ఎస్‌.కె. జానీ పాషాలను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. శాఖాపరమైన విచారణ పెండింగ్‌లో ఉండగానే ఈ చర్యలు చేపట్టారు.

*రికార్డులు పరిశీలించకుండానే లావాదేవీలు*

హుజూర్‌నగర్‌ గ్రామం, మండల పరిధిలోని సర్వే నంబర్లు 458, 281లో భూముల లావాదేవీలకు సంబంధించి అవకతవకలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. హుజూర్‌నగర్‌ ఆర్డీవో సమర్పించిన నివేదికల ఆధారంగా ఈ వ్యవహారాన్ని జిల్లా యంత్రాంగం తీవ్రంగా పరిగణించింది. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు (ఎన్‌ఎస్‌పీ) సాగునీటి కాలువలకు సంబంధించిన భూములు, భూసంస్కరణల చట్టం పరిధిలోని భూముల విషయంలో పాత రెవెన్యూ రికార్డులు, గతంలో జరిగిన విచారణలు, న్యాయస్థానాల ఉత్తర్వులను పూర్తిస్థాయిలో పరిశీలించకుండానే లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు.

ఇవి కూడా చదవండి

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.