భూ అక్రమాలపై ముగ్గురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
భూముల లావాదేవీల్లో తీవ్ర అవకతవకలు, విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ముగ్గురు రెవెన్యూ అధికారులపై జిల్లా కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ కఠిన చర్యలు తీసుకున్నారు. హుజుర్ నగర్ తహసీల్దార్ బి. కవిత, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ కాశీం షరీఫ్, గ్రామ పాలన అధికారి (జీపీవో) ఎస్.కె. జానీ పాషాలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. శాఖాపరమైన విచారణ పెండింగ్‌లో ఉండగానే ఈ చర్యలు చేపట్టారు. *రికార్డులు పరిశీలించకుండానే లావాదేవీలు* హుజూర్‌నగర్ గ్రామం, మండల పరిధిలోని సర్వే నంబర్లు 458, 281లో భూముల లావాదేవీలకు సంబంధించి అవకతవకలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. హుజూర్‌నగర్ ఆర్డీవో సమర్పించిన నివేదికల ఆధారంగా ఈ వ్యవహారాన్ని జిల్లా యంత్రాంగం...