భూ అక్రమాలపై ముగ్గురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
*రికార్డులు పరిశీలించకుండానే లావాదేవీలు*
హుజూర్‌నగర్ గ్రామం, మండల పరిధిలోని సర్వే నంబర్లు 458, 281లో భూముల లావాదేవీలకు సంబంధించి అవకతవకలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. హుజూర్‌నగర్ ఆర్డీవో సమర్పించిన నివేదికల ఆధారంగా ఈ వ్యవహారాన్ని జిల్లా యంత్రాంగం తీవ్రంగా పరిగణించింది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు (ఎన్‌ఎస్‌పీ) సాగునీటి కాలువలకు సంబంధించిన భూములు, భూసంస్కరణల చట్టం పరిధిలోని భూముల విషయంలో పాత రెవెన్యూ రికార్డులు, గతంలో జరిగిన విచారణలు, న్యాయస్థానాల ఉత్తర్వులను పూర్తిస్థాయిలో పరిశీలించకుండానే లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు.