Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

ఎల్ నినో పై వైద్యశాఖ ప్లాన్ ఏదీ

Author
Posted By Telangana Vaartha
| 23 Oct 2026, 08:44 PM | తాజావార్తలు Flash News
ఎల్ నినో పై వైద్యశాఖ ప్లాన్ ఏదీ

వాతావరణ మార్పులతో ప్రజారోగ్యానికి పొంచి ఉన్న ముప్పు
డీహైడ్రేషన్ తో సమస్యలు పెరుగుతాయని వైద్య నిపుణుల హెచ్చరిక
నిర్లిప్త కార్యాచరణ వెల్లడించిన రాష్ట్ర వైద్యారోగ్య శాఖ

రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావంతో వాతావరణ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వాతావరణ పరిస్థితుల్లో మార్పులతో జలాలు తగ్గడంతో పాటు పగటి ఉష్ణోగ్రతలు ఇప్పటికే 38 డిగ్రీలు దాటి పెరుగుతున్నాయి. వచ్చే నెలల కాలమంతా ఇదే పరిస్థితి కొనసాగుతుందని, ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉందని, ఇక ఎండకాలంలో మరీ ఏప్రిల్ నాటికి మండిపోతాయని అంటున్నారు. అయితే, ఈ పరిణామాలు ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని డీ-ల్యాబ్ ప్రతినిధులతో పాటు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అధిక ఉష్ణోగ్రతల కారణంగా శరీరం నుంచి చెమట రూపంలో నీరు అధికంగా బయటకు పోవడంతో తగినంత నీరు తీసుకోకపోతే డీహైడ్రేషన్ వస్తుంది. తీవ్రత, డీహైడ్రేషన్ వచ్చినపుడు దాహం అనిపిస్తుంది. ఇది మూత్రపిండాలపై చేరి రక్తపోటును తెస్తుంది. ఆరోగ్యం కిడ్నీ, ఇంజూరీ, ఎపిక్ కి దారితీసే ప్రమాదం ఉందని చెబుతున్నారు. కిడ్నీ వ్యాధులు ఉన్నవారు, డయాలసిస్ పేషెంట్లు, డయాబెటిస్, బీపీ బాధితులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. శరీర ఉష్ణోగ్రతల నిరంతరం పెరగడం గుండెకు సంబంధించిన సమస్యలకు దారి తీస్తుంది. పల్సరేటు గుండె సంబంధిత సమస్యలకు హెచ్చరికగా నీటి కొరతను గుర్తించారు.
గర్భిణీలు, బాలింతలు, వృద్ధులు, చిన్నారులు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. తీవ్ర వేడి వల్ల గర్భిణీ స్త్రీలకు ప్రీ ఎక్లాంప్సియా ముప్పు ఏర్పడే అవకాశం ఉంది. ముందస్తు ప్రసవాలు జరిగే ప్రమాదం ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. చిన్నారుల్లో శరీర ఉష్ణోగ్రత నియంత్రణ...
ఎల్ నినో పరిణామాలు సాధారణ వేసవి కంటే అత్యంత ప్రమాదకరమైనవని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. గతంలో 1982-83, 1997-98, 2015-16 సంవత్సరాల్లో ఎల్ నినో ప్రభావం తీవ్రంగా ఉండగా, దాదాపు 6 కోట్లకు పైగా ప్రజలు తీవ్ర అనారోగ్యం, తోపులతో పాటు కరువు బారిన పడ్డారని లాన్సెట్ పేర్కొంది. 1990ల నాటితో పోలిస్తే 2012-2021 మధ్యకాలంలో అధిక వేడి కారణంగా సంభవించే మరణాలు 23 శాతం పెరిగి, ఏటా సగటున 5.46 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని గణాంకాలు చెబుతున్నాయి. కేవలం తీవ్రమైన వేడి వల్ల ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ, నిర్మాణ రంగాల్లో 247 బిలియన్ పని గంటల శ్రమ నష్టం వాటిల్లిందని, భారతీయులు ఏటా ఎదుర్కొనే తీవ్ర వడగాలుల రోజుల సంఖ్య దాదాపు 208 పెరిగిందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
వృద్ధుల పూర్తిగా ఆరోగ్యపై చెడు ప్రభావం పడే అవకాశం ఉందని, దీర్ఘకాలిక గుండె జబ్బులు, మధుమేహం, హైబీపీ ఉన్నవారిపై ఎక్కువ ప్రభావం చూపుతుందని వైద్యులు చెబుతున్నారు. వడదెబ్బ కారణంగా తాగునీటి కొరత, తగ్గే కాలేజీల్లో, కలుషిత నీరు తాగడం వల్ల గ్యాస్ట్రో, డయేరియా, వాంతులు, విరేచనాలు వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
గతేడాది రాష్ట్రవ్యాప్తంగా హీట్ స్ట్రోక్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఆశా ప్రైమరీ హెల్త్ సెంటర్లు (పీహెచ్ సీ), కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు (సీహెచ్ సీ), ఏరియా హాస్పిటల్స్, ప్రైవేటులో మార్చట్లు, కూలర్లతో హీట్ స్ట్రోక్ కు చెక్ పెట్టేందుకు ఏర్పాట్లు చేశారు. సీజన్లో, సన్ స్ట్రోక్ తో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఐవీ ఫ్లూయిడ్స్, నార్మల్ సెలైన్ బాటిల్స్, వాటితో పాటు, అత్యవసర మందులు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. అంతేకాకుండా, ప్రతి ఆసుపత్రిలో గ్లూకోజ్, ఐసీయూలు, వృద్ధులు, చిన్నారుల కోసం ప్రత్యేకంగా గదులు, ఐసీయూలో సదుపాయాలు చేయాలని సూచించారు. ఉపాధి హామీ కూలీలు, వీధుల్లో పనిచేసే కార్మికుల పనివేళలను మార్చాలని సూచించారు. ప్రజలు తగిన జాగ్రత్తలు, ముఖ్యంగా ఓఆర్ఎస్ తాగాలని, ఎండవేడికి అధికంగా బయటకు వెళ్లకుండా ఉండాలని సూచిస్తున్నారు. తగినంత నీరు తాగడం, మూత్ర విసర్జన తగ్గితే కనిపిస్తే డాక్టర్లను సంప్రదించాలని సూచిస్తున్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.