ఎల్ నినో పై వైద్యశాఖ ప్లాన్ ఏదీ

వాతావరణ మార్పులతో ప్రజారోగ్యానికి పొంచి ఉన్న ముప్పు డీహైడ్రేషన్ తో సమస్యలు పెరుగుతాయని వైద్య నిపుణుల హెచ్చరిక నిర్లిప్త కార్యాచరణ వెల్లడించిన రాష్ట్ర వైద్యారోగ్య శాఖ రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావంతో వాతావరణ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వాతావరణ పరిస్థితుల్లో మార్పులతో జలాలు తగ్గడంతో పాటు పగటి ఉష్ణోగ్రతలు ఇప్పటికే 38 డిగ్రీలు దాటి పెరుగుతున్నాయి. వచ్చే నెలల కాలమంతా ఇదే పరిస్థితి కొనసాగుతుందని, ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉందని, ఇక ఎండకాలంలో మరీ ఏప్రిల్ నాటికి మండిపోతాయని అంటున్నారు. అయితే, ఈ పరిణామాలు ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని డీ-ల్యాబ్ ప్రతినిధులతో పాటు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధిక ఉష్ణోగ్రతల...