Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

ఫ్లైఓవర్ వద్దు బైపాస్ ముద్దు

Author
Posted By జేరిపోతుల రాంకుమార్
| 15 Oct 2026, 06:21 AM | తెలంగాణ Telangana
ఫ్లైఓవర్ వద్దు బైపాస్ ముద్దు

తిరుమలగిరి 15 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలోని పూలే అంబేడ్కర్ చౌరస్తాలో ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం వద్దని ఆ ప్రాంతంలోని శాపం యజమానులు రోడ్డుపై ధర్నాకు దిగారు. పనులు ప్రారంభించడానికి వచ్చిన నేషనల్ రోడ్డు అథారిటీ అధికారులు ఈ ఈ నిరంజని రెడ్డి, డి ఈ శ్రీధర్ రావు , ఏ ఈ రామరాజు లను అoడగించారు. ఫ్లైఓవర్ నిర్మాణం చేసినట్లయితే తమ షాపులు నడవమని ఎంతోమంది ఉపాధి కోల్పోతారని వారికి చెప్పారు. అధికారులు పోలీస్ సిబ్బంది షాపు యజమానులకు నచ్చజెప్పి ప్రయత్నం చేసిన వారు వినక పోవడంతో అందరు షాపుల యజమానులతో సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామని అధికారులు చెప్పారు. షాప్ ల యజమానులు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కొమ్మినేని సతీష్ కుమార్, కందుకూరి ప్రవీణ్, బూర్గుల ప్రభాకర్, చిరు వ్యాపారులు షాపుల యజమానులు పాల్గొన్నారు,

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.