Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గెలుపుకు కృషి చేయాలి

Author
Posted By జేరిపోతుల రాంకుమార్
| 14 Oct 2026, 09:58 PM | Array
రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గెలుపుకు కృషి చేయాలి

తిరుమలగిరి 15 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:- తుంగతుర్తి స్వర్గీయ టైగర్ రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి కుమారుడు నల్లగొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రామ్‌రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ పిలుపునిచ్చారు తిరుమలగిరి మండలంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పట్టభద్రుల ఓటర్లను కలిసి ఓటు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించాలని, ప్రతి మండల కేంద్రంలో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. చిన్నచిన్న అభిప్రాయ భేదాలను పక్కనపెట్టి, ప్రతి మండలంలో ఐదుగురు సీనియర్ నాయకులతో కమిటీలు ఏర్పాటు చేసి ముందుకు సాగాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి సూచనల మేరకు పనిచేయాలని కోరారు. తుంగతుర్తి నియోజకవర్గంలో సుమారు 32 వేల పట్టభద్రుల ఓట్లు ఉన్నాయని, ప్రతి ఓటును నమోదు చేయించేందుకు నాయకులు కృషి చేయాలని అన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గుడిపాటి నరసయ్య, మండల పార్టీ అధ్యక్షుడు సుంకరి జనార్ధన్, నియోజకవర్గ కన్వీనర్ నరసింహారెడ్డి, మార్కెట్ చైర్మన్ ఎల్సోజు స్రవంతి నరేష్, పాలెపు చంద్రశేఖర్, జుమ్మిలాల్, పేరాల వీరేష్, కందుకూరి లక్ష్మయ్య, తదితరులు పాల్గొన్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.