రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గెలుపుకు కృషి చేయాలి
తిరుమలగిరి 15 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:- తుంగతుర్తి స్వర్గీయ టైగర్ రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి కుమారుడు నల్లగొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రామ్‌రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ పిలుపునిచ్చారు తిరుమలగిరి మండలంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పట్టభద్రుల ఓటర్లను కలిసి ఓటు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించాలని, ప్రతి మండల కేంద్రంలో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. చిన్నచిన్న అభిప్రాయ భేదాలను పక్కనపెట్టి, ప్రతి మండలంలో ఐదుగురు సీనియర్ నాయకులతో కమిటీలు ఏర్పాటు చేసి ముందుకు సాగాలని సూచించారు....