Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగ అవగాహన కార్యక్రమం

Author
Posted By Telangana Vaartha
| 12 Oct 2026, 08:14 PM | తాజా సమాచారం
ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగ అవగాహన కార్యక్రమం

జోగులాంబ గద్వాల 12 అక్టోబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి. గద్వాల. మానసిక ఆరోగ్యంపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి – DMHO డా. సంధ్యా కిరణ్మయి జోగులాంబ గద్వాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మానసిక ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం నిరంతరం మారుతున్న జీవనశైలి, పని ఒత్తిడి, కుటుంబ మరియు సామాజిక పరిస్థితులు మనుషుల మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని తెలిపారు. అధిక ఒత్తిడి కారణంగ మానసిక సమతుల్యత దెబ్బతిని, ఆలోచనలు, భావోద్వేగాలు, ప్రవర్తనలో ప్రతికూల మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రతికూల ఆలోచనలు, తీవ్రమైన మనోవేదన, నిరంతర విచారం, అలసట, ఏ పనిపైన ఆసక్తి లేకపోవడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదని సూచించారు. ఇటువంటి సమస్యలు ఎదురైనప్పుడు వాటిని దాచిపెట్టకుండ కుటుంబ సభ్యులతో పంచుకోవాలని, అవసరమైనప్పుడు మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించి తగిన చికిత్స, సలహాలు పొందాలని తెలిపారు.
ప్రతి సంవత్సరం అక్టోబర్ 10వ తేదీన ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహించడం ద్వార మానసిక ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం, మానసిక సమస్యలపై ఉన్న అపోహలు, వివక్షను తొలగించడం, బాధితులకు సకాలంలో సహాయం అందించడం ప్రధాన ఉద్దేశమని వివరించారు. ముఖ్యంగ, తీవ్రమైన మానసిక ఆందోళనకు గురవుతున్నవారు లేదా ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కలుగుతున్నవారు ఏమాత్రం ఆలస్యం చేయకుండ సహాయం పొందాలని సూచించారు. మానసిక ఆరోగ్య సమస్యలపై ఉచిత సలహాలు, కౌన్సెలింగ్ కోసం టెలి-మానస్ ఉచిత హెల్ప్‌లైన్ నంబర్ 14416 కు కాల్ చేయవచ్చని తెలిపారు. మానసిక సమస్యలకు సకాలంలో సహాయం పొందడం ద్వార పరిస్థితిని మెరుగుపరుచుకోవచ్చని, మానసిక ఆరోగ్యం కూడ శారీరక ఆరోగ్యంతో సమానంగ ముఖ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో DIO డా. అస్గర్ అలీ, సైకియాట్రిస్ట్ డా. ప్రదీప్ కుమార్, SO తిరుమల్ రెడ్డి, DPHNO వరలక్ష్మి, DVLM నరేందర్ బాబు, ఇన్‌చార్జి DEMO హీర్యానాయక్, నరసయ్యతో పాటు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.