ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగ అవగాహన కార్యక్రమం
ప్రతి సంవత్సరం అక్టోబర్ 10వ తేదీన ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహించడం ద్వార మానసిక ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం, మానసిక సమస్యలపై ఉన్న అపోహలు, వివక్షను తొలగించడం, బాధితులకు సకాలంలో సహాయం అందించడం ప్రధాన ఉద్దేశమని వివరించారు. ముఖ్యంగ, తీవ్రమైన మానసిక ఆందోళనకు గురవుతున్నవారు లేదా ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కలుగుతున్నవారు ఏమాత్రం ఆలస్యం చేయకుండ సహాయం పొందాలని సూచించారు. మానసిక ఆరోగ్య సమస్యలపై ఉచిత సలహాలు, కౌన్సెలింగ్ కోసం టెలి-మానస్ ఉచిత హెల్ప్‌లైన్ నంబర్ 14416 కు కాల్ చేయవచ్చని తెలిపారు. మానసిక సమస్యలకు సకాలంలో సహాయం పొందడం ద్వార పరిస్థితిని మెరుగుపరుచుకోవచ్చని, మానసిక ఆరోగ్యం కూడ శారీరక ఆరోగ్యంతో సమానంగ ముఖ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో DIO డా. అస్గర్ అలీ, సైకియాట్రిస్ట్ డా. ప్రదీప్ కుమార్, SO తిరుమల్ రెడ్డి, DPHNO వరలక్ష్మి, DVLM నరేందర్ బాబు, ఇన్‌చార్జి DEMO హీర్యానాయక్, నరసయ్యతో పాటు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.