ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగ అవగాహన కార్యక్రమం

జోగులాంబ గద్వాల 12 అక్టోబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి. గద్వాల. మానసిక ఆరోగ్యంపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి – DMHO డా. సంధ్యా కిరణ్మయి జోగులాంబ గద్వాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మానసిక ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం నిరంతరం మారుతున్న జీవనశైలి, పని ఒత్తిడి, కుటుంబ మరియు సామాజిక పరిస్థితులు మనుషుల మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని తెలిపారు. అధిక ఒత్తిడి కారణంగ మానసిక సమతుల్యత దెబ్బతిని, ఆలోచనలు, భావోద్వేగాలు, ప్రవర్తనలో ప్రతికూల మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రతికూల ఆలోచనలు, తీవ్రమైన మనోవేదన,...