Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నలమాస కృష్ణగౌడ్..?

Author
Posted By జేరిపోతుల రాంకుమార్
| 11 Oct 2026, 09:26 PM | తెలంగాణ Telangana
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నలమాస కృష్ణగౌడ్..?

తిరుమలగిరి 12 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

ప్రముఖ హైకోర్టు న్యాయవాది,తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి అనేక ప్రజాఉద్యమాలతో దశాబ్దాల ప్రత్యక్ష అనుబంధం ఉన్న నాయకుడు...ఉమ్మడి వరంగల్,ఖమ్మం,నల్గొండ జిల్లాలతోపాటు,తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విస్తృత పరిచయాలు కలిగిన విద్యావంతుడు,బిసి సామాజిక వర్గానికి చెందిన అభ్యుదయవాది డాక్టర్ నలమాస కృష్ణగౌడ్ రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో వరంగల్-నల్గొండ-ఖమ్మం నుంచి బరిలోకి దిగే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం..ఇందుకు సంబంధించిన కార్యచరణను అయన ఇప్పటికే మెదలు పెట్టినట్లు సమాచారం.గ్రాడ్యుయేట్ ఓట్ల నమోదు,ప్రభావిత శక్తులు,వ్యక్తులతో చర్చలు కూడా చాపకింద నీరులా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.ఒకవేళ అయనే కనుక బరిలో ఉంటే తెలంగాణ ఉద్యమకారునిగా, హైకోర్టు న్యాయవాదిగా తెలంగాణ ప్రజలకి అయన సూపరిచితమే సుమారు 25 ఏండ్ల పాటు ప్రజా ఉద్యమంలో కొనసాగటం, బిసి సామజిక వర్గానికి చెందిన వ్యక్తి కావటం ఆయనకి బలాన్ని చేకూరస్తున్నాయి.ఈ మధ్యకాలంలో పార్టీల నుండి శాశన మండలికి వచ్చిన వారు వాళ్ళ పార్టీ భజన వాళ్ళ నాయకుల భజన చేయటమే సరిపోతుంది. నిరుద్యోగుల గురించి మరియు ఉద్యోగస్థుల సమస్యల గురించి మాట్లాడే బలమైన,సమర్ధమైన నాయకులు శాశనమండలిలో లేని సమయంలో నలమాస కృష్ణ కనుక పోటీలో బరిలో ఉంటే ఉద్యోగస్థులు, నిరుద్యోగులు, న్యాయవాదులు,తెలంగాణ ఉద్యమకారులు,సామజిక న్యాయం కోసం పోరాటాలు నిర్వాహస్తున్న వివిధ సంఘాల మద్దతు కూడా ఆయనకే తెలియజేసే అవకాశం ఉంది. ఇదే కనుక నిజమైతే ఈ సారి పట్టభద్రుల ఎన్నిక మరింత ఆసక్తికరంగా,బలమైన పోటీ ఉండొచ్చు అని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఏదిఏమైనా నలమాస కృష్ణ అంశంపై త్వరలోనే మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది...

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.