Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

ప్రజా ప్రభుత్వంలోనే రైతులకు మేలు ఎమ్మెల్యే మందుల సామేలు

Author
Posted By జేరిపోతుల రాంకుమార్
| 10 Oct 2026, 09:34 PM | తెలంగాణ Telangana
ప్రజా ప్రభుత్వంలోనే రైతులకు మేలు ఎమ్మెల్యే మందుల సామేలు

తిరుమలగిరి 10 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

ప్రజా ప్రభుత్వంలోనే రైతులకు మేలు జరుగుతుందని ఇతర పార్టీల నాయకుల మాటలు పట్టించుకోవద్దు రైతులు ఆందోళన చెందవద్దని స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలోని తిరుమలగిరి మండల కేంద్రం లో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పత్రిక విలేకరుల సమావేశంలో మాట్లాడుతు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు బిఆర్ఎస్ నాయకులకు లేదు. కరెంటు కోతలు రైతులు ఇబ్బందులు పడుతున్నారు అంటూ బిఆర్ఎస్ నాయకులు నాటకాలు ఆడుతున్నారు. ఈ యాసంగి సీజన్లో నియోజకవర్గంలో 1,20,000 ఎకరాల ధాన్యం సాగు అవుతుంది. రైతులకు సన్న వడ్లు మరియు దొడ్డు వడ్ల కు అధిక ధర ఉన్నందున ప్రజా పాలల్లో రైతాంగం మొత్తం సంతోషం ఆనందంలో ఉన్నారు. ఎలినినో ప్రభావం వల్ల వర్షాలు తక్కువ పడడం వల్ల యాసంగి ఆరుతడి పంటలు పెసలు, వేరుశనగ, మినుములు, మంచి శనగలు వేసుకోవాలని రైతులకు సూచించారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు సుంకరి జనార్దన్ ,పి ఎస్ సి ఎస్ చైర్మన్ పాలెపు చంద్రశేఖర్, పేరాల వీరేష్ ,జుమ్మిలాల్ వార్డ్ కౌన్సిలర్ బత్తుల శ్రీనివాస్, లక్ష్మయ్య, సుధాకర్, జేరిపోతుల శోభారాణి ,కృష్ణ నాయక్, డానియల్ ,సతీష్ గౌడ్, నరేష్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.