Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

దసరా సెలవుల్లో ప్రైవేట్ పాఠశాలలు నిర్వహించరాదు

Author
Posted By Telangana Vaartha
| 07 Oct 2026, 07:46 PM | తాజా వార్తలు
దసరా సెలవుల్లో ప్రైవేట్ పాఠశాలలు నిర్వహించరాదు

నిబంధనలు ఉల్లంఘిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవు: ఎంఈఓ బి. రాములు
ఐజ, అక్టోబర్ 07: ఐజ మండలంలోని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, ప్రధానోపాధ్యాయులతో మండల విద్యాధికారి బి. రాములు ఈరోజు ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎంఈఓ బి. రాములు మాట్లాడుతూ, దసరా సెలవుల సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ పాఠశాలలను నిర్వహించరాదని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఆదేశాలు, విద్యాశాఖ నిబంధనలను ఉల్లంఘించి సెలవుల్లో పాఠశాలలు నిర్వహించే యాజమాన్యాలపై ఉన్నతాధికారులకు నివేదించి, నిబంధనల ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకునేలా సిఫారసు చేస్తామని హెచ్చరించారు. అదేవిధంగా దసరా సెలవులను సద్వినియోగం చేసుకుని పాఠశాలలకు సంబంధించిన Performance Grade Index (PGI), UDISE+లో పెండింగ్ పనులు, విద్యార్థుల వివరాల నవీకరణ తదితర అంశాలను పూర్తి చేసి, జిల్లాలో ఐజ మండలాన్ని ముందంజలో నిలిపేందుకు ప్రతి పాఠశాల యాజమాన్యం సహకరించాలని కోరారు. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ నిబంధనలను ప్రతి ప్రైవేట్ పాఠశాల తప్పనిసరిగా పాటించాలని ఎంఈఓ సూచించారు.

ఈ సమావేశంలో ప్రైవేట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, MIS కోఆర్డినేటర్ ఆర్. ఉదయ్ కిరణ్, CRP తిరుమలేష్ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.