దసరా సెలవుల్లో ప్రైవేట్ పాఠశాలలు నిర్వహించరాదు
నిబంధనలు ఉల్లంఘిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవు: ఎంఈఓ బి. రాములు ఐజ, అక్టోబర్ 07: ఐజ మండలంలోని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, ప్రధానోపాధ్యాయులతో మండల విద్యాధికారి బి. రాములు ఈరోజు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ బి. రాములు మాట్లాడుతూ, దసరా సెలవుల సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ పాఠశాలలను నిర్వహించరాదని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఆదేశాలు, విద్యాశాఖ నిబంధనలను ఉల్లంఘించి సెలవుల్లో పాఠశాలలు నిర్వహించే యాజమాన్యాలపై ఉన్నతాధికారులకు నివేదించి, నిబంధనల ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకునేలా సిఫారసు చేస్తామని హెచ్చరించారు. అదేవిధంగా దసరా సెలవులను సద్వినియోగం చేసుకుని పాఠశాలలకు సంబంధించిన Performance Grade Index (PGI),...