Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైన శ్రీ సరస్వతీ టాలెంట్ హై స్కూల్, గద్వాల్ విద్యార్థులు

Author
Posted By Telangana Vaartha
| 06 Oct 2026, 07:36 PM | తాజా వార్తలు
రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైన శ్రీ సరస్వతీ టాలెంట్ హై స్కూల్, గద్వాల్ విద్యార్థులు

రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు శ్రీ సరస్వతీ టాలెంట్ హై స్కూల్ విద్యార్థులు ఎంపికైనట్లు కరస్పాండెంట్ మాకం భీమపల్లి గారు తెలిపారు. ఈ నెల 04వ తేదీన జోగులాంబ గద్వాల్ జిల్లాలో జరిగిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలలో పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థి అరవింద్ అండర్-14 విభాగంలో 300 మీటర్ల పరుగు పందెంలో మరియు 7వ తరగతి విద్యార్థులు రోహిత్ నాయక్ అండర్-12 విభాగంలో 60, 200 మీటర్ల పరుగు పందెంలో, సేవా నాయక్ అండర్-10 విభాగంలో 60 మీటర్ల పరుగు పందెం పోటీలలో పాల్గొన్నారని తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయి పోటీలలో గెలుపొంది రాష్ట్ర స్థాయికి ఎంపికై, ఈ నెల 8, 9వ తేదీల్లో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. ప్రిన్సిపాల్ R వెంకటయ్య గౌడ్ గారు, ఇంచార్జి కృష్ణారెడ్డి గారు, PET లు వేణు మరియు ఆనంద్ విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేసి అభినందనలు తెలిపారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.