రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు శ్రీ సరస్వతీ టాలెంట్ హై స్కూల్ విద్యార్థులు ఎంపికైనట్లు కరస్పాండెంట్ మాకం భీమపల్లి గారు తెలిపారు. ఈ నెల 04వ తేదీన జోగులాంబ గద్వాల్ జిల్లాలో జరిగిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలలో పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థి అరవింద్ అండర్-14 విభాగంలో 300 మీటర్ల పరుగు పందెంలో మరియు 7వ తరగతి విద్యార్థులు రోహిత్ నాయక్ అండర్-12 విభాగంలో 60, 200 మీటర్ల పరుగు పందెంలో, సేవా నాయక్ అండర్-10 విభాగంలో 60 మీటర్ల పరుగు పందెం పోటీలలో పాల్గొన్నారని తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయి పోటీలలో గెలుపొంది రాష్ట్ర స్థాయికి ఎంపికై, ఈ నెల 8, 9వ తేదీల్లో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. ప్రిన్సిపాల్ R వెంకటయ్య గౌడ్ గారు, ఇంచార్జి కృష్ణారెడ్డి గారు, PET లు వేణు మరియు ఆనంద్ విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేసి అభినందనలు తెలిపారు.