Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

అలంపూర్ సస్యశ్యామలం కావాలి

Author
Posted By A.Timma Gurudu
| 05 Oct 2026, 07:51 PM | Array
అలంపూర్ సస్యశ్యామలం కావాలి

రైతులందరూ ఆనందంగా ఉండాలన్నదే నా లక్ష్యం...!!
అలంపూర్ మాజీ శాసనసభ్యులు ఏఐసీసీ కార్యదర్శి. సంపత్ కుమార్.
మల్లమ్మకుంట రైతులకు ఎకరాకు రూ.20 లక్షల నష్టపరిహారం
రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి భారీ పరిహారం ప్రకటన
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో భూ నిర్వాసితులకు ఎకరాకు రూ.20 లక్షలు
జోగులాంబ గద్వాల5 అక్టోబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి.
అలంపూర్. నియోజకవర్గంలోని తుమ్మిళ్ల లిఫ్ట్‌ కింద నిర్మించనున్న మల్లమ్మకుంట రిజర్వాయర్ భూసేకరణ ప్రక్రియ ఎట్టకేలకు సాఫీగా ముగిసింది. భూములు కోల్పోతున్న రైతులకు రాష్ట్రంలో ఎక్కడా లేనంతగా ఎకరాకు రూ.20 లక్షల నష్టపరిహారం ప్రకటించడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ రీజ్వాన్ షేక్ బాషా భూ నిర్వాసితులకు ఎకరాకు రూ.20 లక్షల పరిహారం ప్రకటించినట్లు తెలిపారు. రాష్ట్ర చరిత్రలోనే ఇంత భారీ మొత్తంలో నష్టపరిహారం ప్రకటించడం ఇదే తొలిసారి అని రైతులు పేర్కొన్నారు. మల్లమ్మకుంట రిజర్వాయర్ పనులను ఎలాగైనా పూర్తి చేయాలనే లక్ష్యంతో అలంపూర్ మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ ఎస్.ఏ. సంపత్ కుమార్ నిరంతరం కృషి చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో పలుమార్లు చర్చించి రైతుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. రైతులతో చర్చలు జరిపి వారిని ఒప్పించి, మెప్పించి వారికి న్యాయమైన పరిహారం అందేలా డాక్టర్.ఎస్.ఏ.సంపత్ కుమార్ కృషి చేశారని రైతులు కొనియాడారు. గతంలో తుమ్మిళ్ల లిఫ్ట్ కోసం పోరాడి సాధించినప్పటికీ, అనంతరం అసంపూర్తిగా మిగిలిన పనులను పూర్తి చేయడానికి ఆయన నిరంతరం ప్రయత్నించారని తెలిపారు. పరిహారం ప్రకటనతో మల్లమ్మకుంట రైతుల కళ్లల్లో ఆనందం వెల్లివిరిసింది. ఆనంద భాష్పాల మధ్య భూసేకరణ ప్రక్రియ సంతోషకరంగా ముగిసింది. ఈ సందర్భంగా మల్లమ్మకుంట రైతులందరూ కలిసి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ ఎస్.ఏ.సంపత్ కుమార్‌ను శాలువాతో ఘనంగా సత్కరించారు. రైతుల తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి డాక్టర్.ఎస్.ఏ.సంపత్ కుమార్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ పాషా , స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ల్యాండ్ ఎక్విజేషన్ అధికారులు, ఇరిగేషన్ అధికారులు, ఫారెస్ట్ అధికారులు, రెవెన్యూ అధికారులు, మరియు ఆర్డీఎస్ మాజీ చైర్మన్ తనగల సీతారామ రెడ్డి , మార్కెట్ కమిటీ చైర్మన్ దొడ్డప్ప , వైస్ చైర్మన్ పచ్చర్ల కుమార్ , కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు నాగరాజు , తనగల గ్రామ సర్పంచ్ వెంకటేష్ , భూ నిర్వాసితులు మరియు ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.