Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

అంతర్జాతీ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా సర్పంచ్ మరియు చేనేత కార్మీకులకు ఘన సన్మానం

Author
Posted By A.Timma Gurudu
| 05 Oct 2026, 07:46 PM | Array
అంతర్జాతీ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా సర్పంచ్ మరియు చేనేత కార్మీకులకు ఘన సన్మానం

జోగులాంబ గద్వాల ఐదు అక్టోబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి. రాజోలి. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా జోగులాంబ గద్వాల్ జిల్లాలో నిర్వహించిన కార్యక్రమంలో రాజోలి గ్రామానికి చెందిన ముగ్గురిని జిల్లా కలెక్టర్ రిజ్వన్ షేక్ బాషా ఘనంగా సన్మానించారు. రాజోలి గ్రామ సర్పంచ్ సి. గంగిరెడ్డి ని గ్రామ సర్పంచ్‌గా ప్రజలకు అందిస్తున్న సేవలను గుర్తిస్తూ జిల్లా కలెక్టర్ ఘనంగా సన్మానించారు. అనంతరం చేనేత వృత్తినే నమ్ముకొని, చేనేత వృత్తిలోనే జీవనం సాగిస్తున్న చేనేత కళాకారులు మాదుగుండు కొండప్ప, అబిదాబేగం లను వారి వృత్తిపట్ల ఉన్న అంకితభావాన్ని గుర్తిస్తూ సన్మానించారు. గ్రామ సర్పంచ్‌గా ప్రజలకు సేవలందిస్తున్న సి. గంగిరెడ్డి , చేనేత వృత్తినే జీవనాధారంగా చేసుకొని కొనసాగిస్తున్న మాదుగుండు కొండప్ప , అబిదాబేగం లను ముగ్గురిని ఒకే వేదికపై జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా సన్మానించడం రాజోలి గ్రామానికి గర్వ కారణం వృద్ధులకు సన్మానం అంటే వారి అనుభవానికి గౌరవం…
గ్రామ సేవకు గుర్తింపు…
చేనేత వృత్తికి ప్రోత్సాహం…
కృషి చేస్తున్న వారికి సముచిత సత్కారం…
అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా జరిగిన ఈ సన్మానం రాజోలి గ్రామానికి ప్రత్యేక గౌరవాన్ని తీసుకువచ్చింది. ఈ కార్యక్రమం లో రాజోలి గ్రామ ప్రజలు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.