అంతర్జాతీ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా సర్పంచ్ మరియు చేనేత కార్మీకులకు ఘన సన్మానం
జోగులాంబ గద్వాల ఐదు అక్టోబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి. రాజోలి. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా జోగులాంబ గద్వాల్ జిల్లాలో నిర్వహించిన కార్యక్రమంలో రాజోలి గ్రామానికి చెందిన ముగ్గురిని జిల్లా కలెక్టర్ రిజ్వన్ షేక్ బాషా ఘనంగా సన్మానించారు. రాజోలి గ్రామ సర్పంచ్ సి. గంగిరెడ్డి ని గ్రామ సర్పంచ్‌గా ప్రజలకు అందిస్తున్న సేవలను గుర్తిస్తూ జిల్లా కలెక్టర్ ఘనంగా సన్మానించారు. అనంతరం చేనేత వృత్తినే నమ్ముకొని, చేనేత వృత్తిలోనే జీవనం సాగిస్తున్న చేనేత కళాకారులు మాదుగుండు కొండప్ప, అబిదాబేగం లను వారి వృత్తిపట్ల ఉన్న అంకితభావాన్ని గుర్తిస్తూ సన్మానించారు. గ్రామ సర్పంచ్‌గా ప్రజలకు సేవలందిస్తున్న సి. గంగిరెడ్డి , చేనేత వృత్తినే జీవనాధారంగా చేసుకొని...