Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

వృద్ధుల అనుభవాలు యువతరానికి మార్గదర్శనం

Author
Posted By Telangana Vaartha
| 05 Oct 2026, 07:39 PM | జోగులాంబ గద్వాల్
వృద్ధుల అనుభవాలు యువతరానికి మార్గదర్శనం

వయోవృద్ధుల సంక్షేమానికి కృషి.
జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్.

జోగులాంబ గద్వాల 5 అక్టోబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి. గద్వాల. సమాజంలోని వివిధ పరిస్థితులపై వృద్ధుల అనుభవాలు, విలువలు నేటి తరానికి మార్గదర్శనం చేస్తాయని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. గద్వాలలోని బాల భవన్ లో జిల్లా వయోవృద్ధుల సంక్షేమ శాఖ, గ్రామీణ అభివృద్ధి, వైద్య ఆరోగ్యశాఖల ఆధ్వర్యంలో సోమవారం అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ వేడుకలను ఘనంగా ర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రసంగించారు. కుటుంబ జీవనంలో వయోవృద్ధులు ఇటీవల కాలంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, వారి సంక్షేమానికి ఉద్దేశించిన అనేక చట్టాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ యాక్ట్ 2007 ప్రకారం వృద్ధుల సంక్షేమానికి చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. తమ పిల్లల పేరిట ఆస్తులు రాసినప్పటికీ వాళ్లు పట్టించుకోని పక్షంలో ఆస్తులను వెనక్కు తీసుకునే అవకాశం ఉందన్నారు. మహిళా సంఘాల్లో 65 ఏళ్లు ఉన్న వృద్ధ స్త్రీలకు కూడా ప్రభుత్వం రుణాలను ఇస్తోందని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వృద్ధాప్య దశలో ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, ఇష్టమైన వ్యాపకాలతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. గద్వాలలోని స్మృతి వనంలో యోగ షెడ్ నిర్మాణానికి చర్యలు చేపట్టామన్నారు. రెడ్ క్రాస్ భవనంలోనూ రిక్రియేషన్ సౌకర్యాలను కల్పించామన్నారు. వయోవృద్ధులకు ఎలాంటి ఇబ్బందులు వచ్చిన సంబంధిత అధికారులను, తనను కూడా సంప్రదించవచ్చని న్యాయం చేస్తామని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ భరోసా ఇచ్చారు. అనంతరం పలు రంగాల్లో విశేష కృషి చేసిన వయోవృద్ధులను కలెక్టర్ సన్మానించారు. ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్స్ హక్కులు, చట్టాలపై ముద్రించిన పుస్తకాలను విడుదల చేశారు. వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులను అందజేశారు.

ఈ కార్యక్రమంలో సెర్ప్ రాష్ట్ర ప్రాజెక్టు మేనేజర్లు గిరిజా కళ్యాణి, మైథిలి, డిడబ్ల్యుఓ సునంద, డిఎంహెచ్ఓ సంధ్య కిరణ్మయి, ఏపిడి శ్రీనివాస్, డిసిపిఓ నరసింహ, రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ అయ్యపూ రెడ్డి, సీనియర్ సిటిజన్ ఫోరం జిల్లా అధ్యక్షులు మోహన్ రావు, విశ్రాంత ఉద్యోగ సంఘం అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, పలువురు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.