వృద్ధుల అనుభవాలు యువతరానికి మార్గదర్శనం
వయోవృద్ధుల సంక్షేమానికి కృషి. జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్. జోగులాంబ గద్వాల 5 అక్టోబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి. గద్వాల. సమాజంలోని వివిధ పరిస్థితులపై వృద్ధుల అనుభవాలు, విలువలు నేటి తరానికి మార్గదర్శనం చేస్తాయని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. గద్వాలలోని బాల భవన్ లో జిల్లా వయోవృద్ధుల సంక్షేమ శాఖ, గ్రామీణ అభివృద్ధి, వైద్య ఆరోగ్యశాఖల ఆధ్వర్యంలో సోమవారం అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ వేడుకలను ఘనంగా ర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రసంగించారు. కుటుంబ జీవనంలో వయోవృద్ధులు ఇటీవల కాలంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, వారి సంక్షేమానికి ఉద్దేశించిన అనేక చట్టాలను సద్వినియోగం...